Archery World Cup: ఆర్చరీ వరల్డ్‌కప్‌లో భారత్ అరుదైన ఘనత.. తొలిసారి ఆ రికార్డ్
ABN , Publish Date - Apr 27 , 2024 | 06:37 PM
ఆర్చరీ వరల్డ్‌కప్-2024లో భారత్ అదరగొట్టేసింది. షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ సాధించింది. తెలుగుతేజం వెన్నం జ్యోతి సురేఖ సత్తా చాటడం వల్లే భారత్ ఈ అరుదైన ఘనత సాధించింది.
ఆర్చరీ వరల్డ్‌కప్-2024లో (Archery World Cup 2024) భారత్ అదరగొట్టేసింది. షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ సాధించింది. తెలుగుతేజం వెన్నం జ్యోతి సురేఖ (Vennam Jyothi Surekha) సత్తా చాటడం వల్లే భారత్ ఈ అరుదైన ఘనత సాధించింది. మిక్స్‌డ్ డబుల్ ఈవెంట్, మహిళా జట్టు గోల్డ్ మెడల్స్ నెగ్గడంతో.. ఆమె కీలక పాత్ర పోషించింది. కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో.. సురేఖ-అభిషేక్ వర్మ జోడీ ఫైనల్‌లో 158-157 తేడాతో ఎస్తోనియా జట్టుపై విజయాన్ని నమోదు చేసింది. మహిళల జట్టు విభాగంలోనూ. భారతీయ అమ్మాయిలు అద్భుత విజయం సాధించారు.
బాయ్‌ఫ్రెండ్ చెప్పాడని ఆ పని చేసింది.. తీరా చూస్తే మైండ్‌బ్లోయింగ్ ట్విస్ట్!
ఇటలీకి చెందిన మార్సెల్లా టినిలి, ఐరెనె ఫ్రాంచిని, ఎలీసా రోనెర్‌పై వెన్నం జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్నీత్ కౌర్‌తో కూడిన భారత జట్టు.. 236-225 తేడాతో గెలుపొందారు. ప్రత్యర్థి ఆటగాళ్లకు ఏ దశలోనూ అవకాశం ఇవ్వకుండా, మన అమ్మాయిలు చెలరేగి ఆడటంతో.. ఈ విజయం సొంతం అయ్యింది. అటు.. పురుషుల టీమ్ ఈవెంట్‌లో అభిషేక్ వర్మ, ప్రియాన్ష్, ప్రథమేశ్‌తో కూడిన భారత జట్టు నెదర్లాండ్‌కు చెందిన మైక్ స్కాలోసెర్, సిల్ పటెర్, స్టెఫ్ విలిమ్స్ టీమ్‌పై 238-231 తేడాతో గెలుపొంది స్వర్ణం సాధించింది. ఈ విధంగా మూడు విభాగాల్లో భారత్ మూడు స్వర్ణాలు కైవసం చేసుకోవడం.. చరిత్రలో ఇదే మొదటిసారి.
Read Latest Sports News and Telugu News