Share News

T20 Worldcup: నా సలహా వాళ్లకు నచ్చకపోవచ్చు, కానీ టీమిండియాకు అతడే కీలకం: బ్రియాన్ లారా

ABN , Publish Date - May 08 , 2024 | 05:00 PM

ఐసీసీ టోర్నమెంట్లలో టీమిండియా ఎక్కువగా స్టార్ ఆటగాళ్ల పైనే ఆధారపడుతుందని, అలా కాకుండా పూర్తి గేమ్ ప్లాన్‌తో ముందుకెళ్లాలని విండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా సూచించాడు. 2007లో జరిగిన తొలి ఎడిషన్‌లో తప్ప టీమిండియా మళ్లీ టీ-20 ప్రపంచకప్ అందుకోలేదు.

T20 Worldcup: నా సలహా వాళ్లకు నచ్చకపోవచ్చు, కానీ టీమిండియాకు అతడే కీలకం: బ్రియాన్ లారా
Brian Lara

ఐసీసీ టోర్నమెంట్లలో టీమిండియా (Team India) ఎక్కువగా స్టార్ ఆటగాళ్ల పైనే ఆధారపడుతుందని, అలా కాకుండా పూర్తి గేమ్ ప్లాన్‌తో ముందుకెళ్లాలని విండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా (Brian Lara) సూచించాడు. 2007లో జరిగిన తొలి ఎడిషన్‌లో తప్ప టీమిండియా మళ్లీ టీ-20 ప్రపంచకప్ అందుకోలేదు. వచ్చే నెల అమెరికా-వెస్టిండీస్‌లో జరిగే టీ-20 ప్రపంచకప్‌లో (T20 Worldcup) గెలిచేందుకు టీమిండియా ఛాన్స్ ఉందని, అయితే మేనేజ్‌మెంట్ కొన్ని మార్పులు చేసుకోవాలని లారా సూచించాడు.


``జట్టు అంతా సూపర్ స్టార్‌లతో నిండిపోయినప్పుడు ఏం చేయాలో తెలియదు. ప్లాన్‌ను మర్చిపోయి ఆ స్టార్ల మీదే ఆధారపడాల్సి ఉంటుంది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఎవరి పాత్ర ఏంటో అందరికీ స్పష్టంగా చెప్పాలి. టీ-20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టు బాగుంది. అనుభవం, యువ ఉత్సాహం కలిగిన ఆటగాళ్లున్నారు. ఈ టీమ్‌కు ప్రపంచకప్ గెలిచే సత్తా ఉంద``ని లారా అన్నాడు.


``బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో టీమిండియా కొన్ని మార్పులు చేసుకోవాలి. సూపర్ ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్‌ను (Surya Kumar Yadav) మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దింపాలి. కోహ్లీ (Virat Kohli) నాలుగో స్థానానికి మారాలి. నా సలహా కెప్టెన్, కోచ్‌కు నచ్చకపోవచ్చు. కానీ, సూర్యను టాపార్డర్‌లో ఆడిస్తే మంచిది. టీ20 అత్యుత్తమ ప్లేయర్ ముందుగా బ్యాటింగ్‌కు దిగితే అద్భుతాలు చేయగలడ``ని లారా పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి..

Rohit Sharma: రోహిత్ శర్మకు ఏమైంది.. అందుకు కారణమేంటి?


MS Dhoni: ధోనీ 9వ స్థానంలో రావడానికి కారణమిదే.. విమర్శకులకు కౌంటర్


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 08 , 2024 | 05:00 PM