Share News

‘నెదర్లాండ్స్‌’లో జ్యోతికి పసిడి

ABN , Publish Date - May 10 , 2024 | 01:53 AM

తెలుగు అథ్లెట్‌ జ్యోతి ఎర్రాజి అంతర్జాతీయ వేదికపై స్వర్ణ పతకంతో మెరిసింది. నెదర్లాండ్స్‌లోని వాట్‌లో జరిగిన హ్యారీ షల్టింగ్‌ గేమ్స్‌లో జ్యోతి 100 మీటర్ల రేసులో...

‘నెదర్లాండ్స్‌’లో జ్యోతికి పసిడి

న్యూఢిల్లీ: తెలుగు అథ్లెట్‌ జ్యోతి ఎర్రాజి అంతర్జాతీయ వేదికపై స్వర్ణ పతకంతో మెరిసింది. నెదర్లాండ్స్‌లోని వాట్‌లో జరిగిన హ్యారీ షల్టింగ్‌ గేమ్స్‌లో జ్యోతి 100 మీటర్ల రేసులో చాంపియన్‌గా నిలిచింది. గురువారం రాత్రి జరిగిన వరల్డ్‌ అథ్లెటిక్స్‌ కేటగిరి ఈ ఈవెంట్‌ పోటీల్లో రేసును 12.87 సెకన్లలో ముగించి జ్యోతి అగ్రస్థానం దక్కించుకుంది. వైజాగ్‌కు చెందిన 24 ఏళ్ల జ్యోతికిది ఈ సీజన్‌ అవుట్‌డోర్‌ పోటీల్లో ఇదే తొలి విజయం కావడం విశేషం.

Updated Date - May 10 , 2024 | 01:53 AM