Share News

గుజరాత్‌ ఢమాల్‌

ABN , Publish Date - Apr 18 , 2024 | 02:41 AM

ఎట్టకేలకు బౌలర్లు చెలరేగడంతో.. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయాన్ని నమోదు చేసింది. బుధవారం ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 6 వికెట్లతో గుజరాత్‌ టైటాన్స్‌ను చిత్తు చేసింది. కేవలం 53 బంతుల్లోనే లక్ష్యాన్ని...

గుజరాత్‌ ఢమాల్‌

నేటి మ్యాచ్‌

పంజాబ్‌ X ముంబై, రాత్రి, 7.30 గం.

దుమ్మురేపిన ఢిల్లీ బౌలర్లు

89 పరుగులకే టైటాన్స్‌ అవుట్‌

53 బంతుల్లోనే గెలిచిన పంత్‌ సేన

అహ్మదాబాద్‌: ఎట్టకేలకు బౌలర్లు చెలరేగడంతో.. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయాన్ని నమోదు చేసింది. బుధవారం ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 6 వికెట్లతో గుజరాత్‌ టైటాన్స్‌ను చిత్తు చేసింది. కేవలం 53 బంతుల్లోనే లక్ష్యాన్ని చేరుకొన్న క్యాపిటల్స్‌ నెట్‌ రన్‌రేట్‌ను భారీగా మెరుగుపరచుకొంది. తొలుత గుజరాత్‌ 17.3 ఓవర్లలో 89 పరుగులకు కుప్పకూలింది. రషీద్‌ ఖాన్‌ (31) టాప్‌ స్కోరర్‌. ముకేశ్‌ 3 వికెట్లు పడగొట్టగా.. ఇషాంత్‌, స్టబ్స్‌ చెరో 2 వికెట్లు దక్కించుకొన్నారు. అనంతరం స్వల్ప ఛేదనలో ఢిల్లీ 8.5 ఓవర్లలో 92/4 స్కోరు చేసి అలవోకగా నెగ్గింది. జాక్‌ ఫ్రేజర్‌ (10 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 20), హోప్‌ (10 బంతు ల్లో ఫోర్‌, 2 సిక్స్‌లతో 19), రిషభ్‌ పంత్‌ (16 నాటౌట్‌) వేగంగా ఆడారు. సందీప్‌ వారియర్‌ 2 వికెట్లు పడగొట్టాడు. రెండు స్టంపింగ్‌లు, రెండు క్యాచ్‌లు పట్టడంతో పాటు బ్యాటింగ్‌లో అజేయంగా నిలిచిన ఢిల్లీ కెప్టెన్‌ పంత్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ దక్కింది. ఈ గెలుపుతో ఢిల్లీ పట్టికలో ఆరో స్థానానికి చేరుకొంది.

ఎడాపెడా బాదేశారు..: స్వల్ప లక్ష్య ఛేదనను ఢిల్లీ వీలైనంత వేగంగా ముగించింది. వార్నర్‌ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన ఫ్రేజర్‌ తొలి ఓవర్‌లోనే 4,6తో జోరు చూపాడు. ఆ తర్వాతి ఓవర్‌లో 6,4 బాదిన ఫ్రేజర్‌ను స్పెన్సర్స్‌ అవుట్‌ చేయడంతో.. మొదటి వికెట్‌కు 25 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఫోర్‌తో గేర్‌ మార్చే ప్రయత్నం చేస్తున్న మరో ఓపెనర్‌ పృథ్వీ షా (7)ను వారియర్‌ వెనక్కిపంపాడు. ఈ దశలో జతకలసిన అభిషేక్‌ పోరెల్‌ (15), షాయ్‌ హోప్‌ వేగంగా ఆడుతూ మూడో వికెట్‌కు 14 బంతుల్లో 34 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. 5వ ఓవర్‌లో వారియర్‌ బౌలింగ్‌లో హోప్‌ 4,6,6తో జోరు చూపగా.. సిక్స్‌ బాదిన పోరెల్‌ ఆ తర్వాతి బంతికి బౌల్డ్‌ అయ్యాడు. కానీ, ఈ ఒక్క ఓవర్‌లోనే వీరిద్దరూ 23 పరుగులు రాబట్టారు. అయితే, హోప్‌ను రషీద్‌ క్యాచవుట్‌ చేయడంతో.. పవర్‌ప్లే ముగిసే సరికి ఢిల్లీ 67/4తో నిలిచింది. అనంతరం పంత్‌, సుమిత్‌ (9 నాటౌట్‌) ఐదో వికెట్‌కు అజేయంగా 25 పరుగులు జోడించడంతో.. క్యాపిటల్స్‌ మరో 67 బంతులు మిగిలుండగానే గెలిచింది. పంత్‌ 6,4 బాదగా.. సుమిత్‌ రెండు బౌండ్రీలతో మ్యాచ్‌ను ముగించాడు.

పెవిలియన్‌కు క్యూ..: ఢిల్లీ బౌలర్లు ఇషాంత్‌, ముకేశ్‌ విజృంభించడంతో.. గుజరాత్‌ బ్యాటింగ్‌ పేకమేడను తలపించింది. క్రమం తప్పకుండా వికెట్లను చేజార్చుకొన్న టైటాన్స్‌.. లీగ్‌లో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ బ్యాటింగ్‌లో రషీద్‌ మినహా ఒక్క బ్యాటర్‌ కూడా మూడు పదుల స్కోరు దాటలేక పోయారు. పవర్‌ప్లేలోనే టాపార్డర్‌ బ్యాటర్లు గిల్‌ (8), సాహా (2), సాయి సుదర్శన్‌ (12)తోపాటు మిల్లర్‌ (2) వికెట్లను కోల్పోయిన గుజరాత్‌ 30/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది. రెండు ఫోర్లతో ధాటిగా ఆడుతున్న గిల్‌ను అవుట్‌ చేసిన ఇషాంత్‌.. టైటాన్స్‌ పతనానికి నాంది పలికాడు. ముకేష్‌ బౌలింగ్‌లో సాహా వికెట్ల మీదకు ఆడుకొన్నాడు. సుమిత్‌ మెరుపు ఫీల్డింగ్‌తో సుదర్శన్‌ రనౌట్‌ కాగా.. ఇషాంత్‌ బౌలింగ్‌లో పంత్‌ అద్భుత క్యాచ్‌తో మిల్లర్‌ వెనుదిరిగాడు. ఈ దశలో అభినవ్‌ మనోహర్‌ (8), రాహుల్‌ తెవాటియా (10) జట్టును ఆదుకొంటారని భావించారు. కానీ, 9వ ఓవర్‌లో మనోహర్‌, షారుక్‌ ఖాన్‌ (0)లను పంత్‌ స్టంపౌట్‌ చేయడంతో.. టైటాన్స్‌ 54/6తో కోలుకోలేక పోయింది. రషీద్‌ రెండు బౌండ్రీలతో దూకుడుగా ఆడాడు. కానీ, 12వ ఓవర్‌లో తెవాటియాను అక్షర్‌ ఎల్బీ చేయడంతో గుజరాత్‌ ఇన్నింగ్స్‌ ఎంతోసేపు సాగలేదు. మోహిత్‌ శర్మ (2)ను ఖలీల్‌ పెవిలియన్‌ చేర్చాడు. 18వ ఓవర్‌లో రషీద్‌తోపాటు నూర్‌ అహ్మద్‌ (1)ను అవుట్‌ చేసిన ముకేశ్‌.. వంద పరుగులలోపే గుజరాత్‌ ఇన్నింగ్స్‌కు తెరదించాడు.

స్కోరుబోర్డు

గుజరాత్‌: సాహా (బి) ముకేశ్‌ 2, గిల్‌ (సి) పృఽథ్వీషా (బి) ఇషాంత్‌ 8, సాయి సుదర్శన్‌ (రనౌట్‌) 12, మిల్లర్‌ (సి) పంత్‌ (బి) ఇషాంత్‌ 2, మనోహర్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) స్టబ్స్‌ 8, తెవాటియా (ఎల్బీ) అక్షర్‌ 10, షారుక్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) స్టబ్స్‌ 0, రషీద్‌ (సి) పంత్‌ (బి) ముకేశ్‌ 31, మోహిత్‌ (సి) సుమిత్‌ (బి) ఖలీల్‌ 2, నూర్‌ అహ్మద్‌ (బి) ముకేశ్‌ 1, జాన్సన్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 17.3 ఓవర్లలో 89 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-11, 2-28, 3-28, 4-30, 5-47, 6-48, 7-66, 8-78, 9-88, 10-89; బౌలింగ్‌: ఖలీల్‌ 4-1-18-1, ఇషాంత్‌ శర్మ 2-0-8-2, ముకేశ్‌ 2.3-0-14-3, కుల్దీప్‌ యాదవ్‌ 4-0-16-0, స్టబ్స్‌ 1-0-11-2, అక్షర్‌ 4-0-17-1.

ఢిల్లీ: పృథ్వీ షా (సి) జాన్సన్‌ (బి) సందీప్‌ 7, ఫ్రేజర్‌ (సి) మనోహర్‌ (బి) జాన్సన్‌ 20, అభిషేక్‌ (బి) సందీప్‌ 15, హోప్‌ (సి) ఇషాంత్‌ (బి) రషీద్‌ 19, పంత్‌ (నాటౌట్‌) 16, సుమిత్‌ (నాటౌట్‌) 9, ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 8.5 ఓవర్లలో 92/4; వికెట్ల పతనం: 1-25, 2-31, 3-65, 4-67; బౌలింగ్‌: సందీప్‌ 3-0-40-2, జాన్సన్‌ 2-0-22-1, రషీద్‌ 2-0-12-1, నూర్‌ అహ్మద్‌ 1.5-0-14-0.

1

89 పరుగులు చేసిన గుజరాత్‌కు ఐపీఎల్‌లో ఇదే అత్యల్ప స్కోరు. గతేడాది ఢిల్లీపై టైటాన్స్‌ 125/6 స్కోరు చేసింది.

1

బంతుల పరంగా (67 బంతుల్లో) ఢిల్లీకి ఇదే భారీ గెలుపు.

పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

రాజస్థాన్‌ 7 6 1 0 12 0.677

కోల్‌కతా 6 4 2 0 8 1.399

చెన్నై 6 4 2 0 8 0.726

హైదరాబాద్‌ 6 4 2 0 8 0.502

లఖ్‌నవూ 6 3 3 0 6 0.038

ఢిల్లీ 7 3 4 0 6 -0.074

గుజరాత్‌ 7 3 4 0 6 -1.303

పంజాబ్‌ 6 2 4 0 4 -0.218

ముంబై 6 2 4 0 4 -0.234

బెంగళూరు 7 1 6 0 2 -1.185

గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;

ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్‌ రన్‌రేట్‌

Updated Date - Apr 18 , 2024 | 02:41 AM