Share News

ఫ్యాన్‌ క్రేజ్‌.. ఫ్రాంచైజీలకు ‘క్యాష్‌’!

ABN , Publish Date - Apr 18 , 2024 | 02:35 AM

ఫ్రాంచైజీ క్రికెట్‌ వినోదానికి కేరా్‌ఫ..ధనాధన్‌ బ్యాటింగ్‌, మెరుపు ఫీల్డింగ్‌..పిచ్‌ అనుకూలిస్తే వికెట్ల పండుగ చేసుకొనే పేసర్లు, స్పిన్నర్లు..మొత్తం మూడు గంటల్లో ముగిసే ఫ్రాంచైజీ క్రికెట్‌పై ఫ్యాన్స్‌కు...

ఫ్యాన్‌ క్రేజ్‌.. ఫ్రాంచైజీలకు ‘క్యాష్‌’!

న్యూఢిల్లీ: ఫ్రాంచైజీ క్రికెట్‌ వినోదానికి కేరా్‌ఫ..ధనాధన్‌ బ్యాటింగ్‌, మెరుపు ఫీల్డింగ్‌..పిచ్‌ అనుకూలిస్తే వికెట్ల పండుగ చేసుకొనే పేసర్లు, స్పిన్నర్లు..మొత్తం మూడు గంటల్లో ముగిసే ఫ్రాంచైజీ క్రికెట్‌పై ఫ్యాన్స్‌కు ఎక్కడలేని క్రేజ్‌..అందుకే అభిమానుల ఈ పిచ్చిని ఫ్రాంచైజీలు బాగా ‘క్యాష్‌’ చేసుకుంటున్నాయి. ‘డైనమిక్‌ రేట్స్‌’ పేరిట ఫ్యాన్స్‌ జేబును గుల్ల చేస్తున్నాయి ! సొంత మైదానంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మ్యాచ్‌కు బెస్ట్‌ సీట్‌ చివరి నిమిషంలో కావాలంటే..టిక్కెట్‌ రేటు ఎంతో తెలుసా... రూ. 52,938 ! టిక్కెట్‌ ధరల నిర్ణయాధికారం ఫ్రాంచైజీలకు బోర్డు వదిలేయడమే ఈ అధిక ధరలకు కారణం ! టిక్కెట్ల కోసం ఎగబడుతున్న ఫ్యాన్స్‌..కూడా ధరల విషయంలో ఫిర్యాదు చేయడం లేదట.

వరుస ఓటములు..అయినా తగ్గని క్రేజ్‌: బెంగళూరు జట్టు దారుణ వైఫల్యాలు చవిచూస్తున్నా..ఆ టీమ్‌ ఫ్యాన్‌ క్రేజ్‌ ఏమాత్రం తగ్గడంలేదు. ఈ క్రేజ్‌ను ఆర్సీబీ ఫ్రాంచైజీ బాగా ‘సొమ్ము’ చేసుకుంటోంది. బెంగళూరు జట్టు సొంతమైదానంలో ఆడే మ్యాచ్‌కు అతి తక్కువ శ్రేణి టిక్కెట్‌ రేటు ఎంతో తెలుసా..రూ.2300 ! ఈసారి ఐపీఎల్‌లో బెంగళూరులో ఇదే అతి తక్కువ టిక్కెట్‌ ధర ఇదే కావడం గమనార్హం. ఈ డైనమిక్‌ ధరలనుంచి తక్కువ రేటు కలిగిన టిక్కెట్లను మినహాయించారు. కానీ ఎక్కువ రేటు కలిగిన టిక్కెట్ల విషయంలో ‘డైనమిక్‌’ విధానం అనుసరిస్తుండడంతో మ్యాచ్‌ డే దగ్గరపడుతున్నకొద్దీ వాటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. హోమ్‌ గ్రౌండ్‌లో బెంగళూరు తొలి మ్యాచ్‌కు టెర్రాస్‌ టిక్కెట్‌ రేటును రూ. 4,840 నుంచి రూ. 6,292కి పెంచేశారు. ఇక కార్పొరేట్‌ స్టాండ్‌ టిక్కెట్‌ ధర అయితే రూ. 42,350 నుంచి 52,938కి చేరింది.

Updated Date - Apr 18 , 2024 | 02:35 AM