Share News

New Zealand: న్యూజిలాండ్ టీ20 వరల్డ్‌కప్ జట్టుని ప్రకటించిన చిన్నారులు.. వీడియో వైరల్

ABN , Publish Date - Apr 29 , 2024 | 04:07 PM

త్వరలోనే ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్ కోసం మే 1వ తేదీలోగా తమ జట్లని ప్రకటించాలని ఐసీసీ సూచించడంతో.. ఈ మెగా టోర్నీలో భాగం కానున్న క్రికెట్ బోర్డ్స్ తమతమ జట్లను ఫైనల్ చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలోనే న్యూజిలాండ్...

New Zealand: న్యూజిలాండ్ టీ20 వరల్డ్‌కప్ జట్టుని ప్రకటించిన చిన్నారులు.. వీడియో వైరల్
2 Kids Announce New Zealand T20 World Cup Squad

త్వరలోనే ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) కోసం మే 1వ తేదీలోగా తమ జట్లని ప్రకటించాలని ఐసీసీ (ICC) సూచించడంతో.. ఈ మెగా టోర్నీలో భాగం కానున్న క్రికెట్ బోర్డ్స్ తమతమ జట్లను ఫైనల్ చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ (New Zealand) బోర్డ్ తమ జట్టుని ప్రకటించింది. ఇందుకోసం ఓ వినూత్న మార్గాన్ని ఎంపిక చేసింది. కెప్టెన్, చీఫ్ సెలక్టర్, లేదా ప్రధాన కోచ్‌తో జట్టుని ప్రకటించకుండా.. ఇద్దరు చిన్నారులతో జట్టు సభ్యుల పేర్లను వెల్లడించింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


అతడ్ని బెంచ్‌కే పరిమితం చేస్తే.. అంతకంటే ఘోర అన్యాయం ఇంకోటి ఉండదు

ఆ ఇద్దరు చిన్నారుల పేర్లు మటిల్డా, ఆంగస్. వీళ్లిద్దరు ఎంతో ఆసక్తికరంగా, క్యూట్‌గా మాట్లాడుతూ.. 15 మంది జట్టు సభ్యుల పేర్లను ప్రకటించారు. తాము వరల్డ్‌కప్ జట్టుని ప్రకటించేందుకు వచ్చామని, ఇలాంటి అవకాశం వచ్చినందుకు తమకెంతో ఆనందంగా ఉందన్నారు. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న మెగా టోర్నీ కోసం న్యూజిలాండ్ జట్టు కెప్టెన్‌గా కేన్ విలియమ్సన్‌ని (Kane Williamson) ఎంపిక చేసుకున్నామని వాళ్లు పేర్కొన్నారు. ఈ చిన్నారులు జట్టు సభ్యుల పేర్లను వెల్లడించాక.. న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టీడ్ మాట్లాడాడు. వరల్డ్‌‌కప్‌ కోసం ఎంపికైన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. విండీస్, యూఎస్‌ఏ పరిస్థితులను త్వరగా అలవాటు చేసుకొనే స్క్వాడ్‌ను ఎంపిక చేశామని తాను భావిస్తున్నానని అన్నాడు. ఈ మెగా టోర్నీలో తమ జట్టు బాగా రాణిస్తుందని తాను ఆశిస్తున్నానని చెప్పుకొచ్చాడు.

సచిన్‌లాగే విరాట్ కోహ్లీ వెనక్కు తగ్గాల్సిందే.. సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు

న్యూజిలాండ్ టీమ్‌: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైకెల్ బ్రాస్‌వెల్, మార్క్‌ చాప్‌మన్, డేవన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్‌, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఐష్ సోధి, టిమ్‌ సౌథి. (ట్రావెలింగ్‌ రిజర్వ్: బెన్ సీర్స్). కాగా.. వరల్డ్‌కప్ కోసం న్యూజిలాండ్ జట్టు మే 23వ తేదీన బయలుదేరనుంది. జూన్ 7వ తేదీన ఆఫ్ఘనిస్థాన్‌తో కివీస్ జట్టు తన తొలి మ్యాచ్ ఆడనుంది.

Read Latest Sports News and Telugu News

Updated Date - Apr 29 , 2024 | 04:08 PM