కాన్వే..ఐపీఎల్ నుంచి అవుట్
ABN , Publish Date - Apr 19 , 2024 | 02:12 AM
చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే గాయంతో ఈసారి ఐపీఎల్‌కు పూర్తిగా దూరమయ్యాడు...
చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే గాయంతో ఈసారి ఐపీఎల్‌కు పూర్తిగా దూరమయ్యాడు. వాస్తవంగా..గత ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ సందర్భంగా కాన్వే ఎడమచేతి చూపుడు వేలు విరగడంతో ఆపరేషన్ చేయించుకున్నాడు. ఫలితంగా ఐపీఎల్‌కు అందుబాటులో ఉండడని గతంలో భావించారు. ఇప్పుడు దానిని అధికారికంగా ప్రకటించారు. గతేడాది ఫైనల్లో అతడు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. ఇక..కాన్వే స్థానంలో ఇంగ్లిష్ పేసర్ రిచర్డ్ గ్లీసన్ (రూ. 50 లక్షలు) ను తీసుకున్నారు.