Share News

సాధారణ ఆర్చర్లతో పోటీపడి రజతం కొల్లగొట్టింది

ABN , Publish Date - Apr 18 , 2024 | 02:33 AM

ఆసియా పారా క్రీడల స్వర్ణ పతక విజేత, 17 ఏళ్ల శీతల్‌ దేవి మరోసారి అదిరిపోయే ప్రదర్శన చేసింది. ఖేలో ఇండియా జాతీయ ర్యాంకిం గ్‌ ఆర్చరీ టోర్నమెంట్‌లో రజతంతో మెరిసింది...

సాధారణ ఆర్చర్లతో పోటీపడి రజతం కొల్లగొట్టింది

  • ఖేలో ఇండియాలో మెరిసిన పారా అథ్లెట్‌ శీతల్‌

న్యూఢిల్లీ: ఆసియా పారా క్రీడల స్వర్ణ పతక విజేత, 17 ఏళ్ల శీతల్‌ దేవి మరోసారి అదిరిపోయే ప్రదర్శన చేసింది. ఖేలో ఇండియా జాతీయ ర్యాంకిం గ్‌ ఆర్చరీ టోర్నమెంట్‌లో రజతంతో మెరిసింది. అయితే, ఈ పోటీల్లో ఆమె సాధారణ ఆర్చర్ల విభాగంలో పోటీపడి పతకం నెగ్గడం విశేషం. మంగళవారం ఢిల్లీలో జరిగిన జూనియర్‌ కాంపౌండ్‌ వ్యక్తిగత కేటగిరీ ఫైనల్లో శీతల్‌ 138-140 స్కోరుతో ఏక్తా చేతిలో ఓడి, రజతంతో సరిపెట్టుకుంది. ఏక్తాకు రూ.50 వేలు, శీతల్‌కు రూ.40 వేలు నగదు బహుమతి లభించింది.

Updated Date - Apr 18 , 2024 | 02:33 AM