Share News

Viral Video: పులికి చిక్కితే అలాగే ఉంటుంది.. మడుగులో చిక్కిన జింకను ఒక్క దెబ్బతో ఎలా చంపిందో చూడండి..!

ABN , Publish Date - May 08 , 2024 | 01:06 PM

అడవికి రాజు సింహం అయినప్పటికీ, వేటాడే విషయంలో పులి మిగతా అన్ని జంతువుల కంటే ముందు ఉంటుంది. సింహం నుంచి అయినా తప్పించుకోవచ్చు గానీ, పులికి చిక్కితే ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సిందే. తాజాగా రాజస్థాన్‌లోని రణథంబోర్ నేషనల్ పార్క్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Viral Video: పులికి చిక్కితే అలాగే ఉంటుంది.. మడుగులో చిక్కిన జింకను ఒక్క దెబ్బతో ఎలా చంపిందో చూడండి..!
tiger hunting

అడవికి రాజు సింహం అయినప్పటికీ, వేటాడే విషయంలో పులి (Tiger) మిగతా అన్ని జంతువుల కంటే ముందు ఉంటుంది. సింహం నుంచి అయినా తప్పించుకోవచ్చు గానీ, పులికి చిక్కితే ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సిందే. తాజాగా రాజస్థాన్‌లోని రణథంబోర్ నేషనల్ పార్క్‌కు (Ranthambhore National Park ) సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ పార్క్‌లోని ఓ రిజర్వాయర్‌లో ఓ జింకను పులి వేటాడి చంపేసింది. ఆ వీడియో నెటిజన్లను షాక్‌కు గురి చేస్తోంది (Viral Video).


ranthambhorepark ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ చెరువులో ఉన్న జింకను (Deer) పులి పట్టుకుంది. జింకపై పంజా దాడి చేసి దానిని నీటలో ముంచేసింది. ఒక్క దెబ్బకే జింక అచేతన స్థితికి వెళ్లిపోయింది. నీటిపై ఆ జింక కొమ్ములు మాత్రమే కనిపించాయి. క్షణాల వ్యవధిలో జింక ప్రాణాలు కోల్పోయింది. ఆ జింకను పులి చంపుతుండగా చూసిన పర్యాటకులు కేకలు వేశారు. రాజ్‌కుమార్ గుర్జార్ అనే వ్యక్తి ఈ ఘటనను వీడియో తీశాడు (Tiger Hunting Videos).


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను 24 వేల కంటే ఎక్కువ మంది వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``నీటిలో కూడా వేటాడగలగడం పులి బలం``, ``పాపం.. ఆ జింక టైమ్ బాగోలేదు``, ``పులికి తెలివి తేటలు కూడా ఎక్కువ`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. కాగా, ఇటీవలి కాలంలో రణతంబోర్ నేషనల్ పార్క్ జోన్ 10లో 108 జింకలు ప్రాణాలు కోల్పోయాయట.

ఇవి కూడా చదవండి..

Viral Video: ప్లాస్టిక్ డ్రమ్ముతో కూలర్.. వేసవిలో వెరైటీ ఐడియాలతో రకరకాల కూలర్లు.. వీడియో వైరల్!


Puzzle: మీ కళ్లకు రియల్ టెస్ట్.. ఈ ఫొటోలో టూత్ బ్రష్ ఎక్కడుందో 10 సెకెన్లలో కనిపెట్టండి!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 08 , 2024 | 01:06 PM