Share News

Working in Theatre: థియేటర్‌లో సినిమా చూస్తున్న మహిళ.. ముందు సీట్లోని వ్యక్తి చిమ్మ చీకట్లో చేస్తున్నదేంటో చూసి..

ABN , Publish Date - Mar 28 , 2024 | 09:03 PM

సినిమా థియేటర్‌కొచ్చిన ఓ మహిళ.. ముందు సీట్లో కూర్చున్న వ్యక్తి ఏం చేస్తున్నాడో చూసి ఆశ్చర్యపోయంది. ఈ ఉదంతాన్ని నెట్టింట పంచుకోవడంతో జనాలు కూడా మహిళ లాగే నోరెళ్లబెడుతున్నారు.

Working in Theatre: థియేటర్‌లో సినిమా చూస్తున్న మహిళ.. ముందు సీట్లోని వ్యక్తి చిమ్మ చీకట్లో చేస్తున్నదేంటో చూసి..

ఇంటర్నెట్ డెస్క్: సినిమా థియేటర్‌కొచ్చిన ఓ మహిళ.. ముందు సీట్లో కూర్చున్న వ్యక్తి ఏం చేస్తున్నాడో చూసి ఆశ్చర్యపోయంది. ఈ ఉదంతాన్ని నెట్టింట పంచుకోవడంతో జనాలు కూడా మహిళ లాగే నోరెళ్లబెడుతున్నారు. బెంగళూరులో (Bengaluru) ఇటీవల వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.

రిషికా అనే మహిళ ట్విట్టర్ వేదికగా ఈ ఉదంతాన్ని పంచుకుంది. తాను కుంఫూ పాండా-4 సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లానని చెప్పంది. అక్కడ చిమ్మ చీకటిలో అంతా మూవీ చూడటంలో మునిగిపోతే తన ముందు సీట్లోని వ్యక్తి మాత్రం లాప్‌టాప్‌లో పని చేసుకుంటూ సినిమా విషయాన్ని మర్చిపోయాడని తెలిపింది (Man working on laptop in Movie Theatre). తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేస్తున్నాడో లేక పనిపై శ్రద్ధో తనకు అర్థం కావట్లేదని వ్యాఖ్యానించింది.

Spit Stains: ఈ మహిళ కష్టం చూసాకైన జనాల్లో మార్పొస్తుందా? నెటిజన్లను కలచివేస్తున్న వీడియో!


జనాలకు ఈ ఉదంతం బాగా నచ్చడంతో ఈ ట్వీట్ బాగా వైరల్ అయ్యింది. వేల సంఖ్యలో కామెంట్స్, వ్యూస్ వచ్చాయి. బెంగళూరు జీవితాలు ఇంతేనంటూ అనేక మంది కామెంట్ చేశారు. రోజంతా పనిచేసినా తరగని పనితో బిజీబిజీగా గడిపే నగరవాసులు.. ముఖ్యంగా టెకీలు చివరకు ఇలాంటి సందర్భాల్లోనూ పనిచేయాల్సి వస్తోందని అభిప్రాయపడ్డారు. వృత్తిజీవితం, వ్యక్తిగత జీవితం మధ్య సమతౌల్యం (Work-Life Balance) సాధించలేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ‘బెంగళూరులో ఇంతే..పెద్దగా పట్టించుకోనక్కర్లేదు’ అని కొందరు కామెంట్ చేశారు. చాలా మంది మాత్రం ఈ దృశ్యాన్ని చూసి విచారం వ్యక్తం చేశారు. అందమైన జీవితాలు అనేకం ఇలాగే గడిచిపోతున్నాయని కామెంట్ చేశారు.

కాగా, ట్రాఫిక్‌ గంటల తరబడి ఇరుక్కుపోయిన అనేక మంది బెంగళూరు వాసులు ఆ సమయాన్ని వివిధ రకాలుగా సద్వినియోగం చేసుకున్న వీడియోలు గతంలో చాలా వైరల్ అయ్యాయి. ట్రాఫిక్‌లో చిక్కుకున్న కొందరు స్కూటీలపైనే కూరలు తరిగితే మరికొందరు లాప్‌టాప్ ఓపెన్ చేసి ఆఫీస్ పని చేసుకున్నారు.

Juvenile Robbers: 11 ఏళ్ల వయసులోనే బ్యాంకు దోపిడీ.. సెలవుల్లో స్కూలు పిల్లల దారుణం! ఎలా చేశారంటే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 28 , 2024 | 09:17 PM