TS SSC Results 2024 Updates : రేపు ఉదయం పదో తరగతి ఫలితాలు..! ఒకే ఒక్క క్లిక్‌తో ఇలా చెక్‌ చేసుకోవచ్చు..

ABN, Publish Date - Apr 29 , 2024 | 08:16 PM

తెలంగాణలో పదో తరగతి ఫలితాలు (TS SSC Results 2024) విడుదల కానున్నాయి. ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 11.00 గంటలకు ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఫలితాలను ఆంధ్రజ్యోతి వెబ్‌సై‌ట్‌తోపాటు SSC బోర్డు వెబ్‌సైట్‌లోనూ చెక్ ఇలా చేసుకోవచ్చు..

TS SSC Results 2024 Updates : రేపు ఉదయం పదో తరగతి ఫలితాలు..! ఒకే ఒక్క క్లిక్‌తో ఇలా చెక్‌ చేసుకోవచ్చు.. 1/6

ఈ ఏడాది, మార్చి 18న ఈ పరీక్షలు ప్రారంభమై.. ఏప్రిల్ 2వ తేదీతో ముగిశాయి. ఈ పరీక్షలకు మొత్తం 5,08,385 మంది హాజరయ్యారు. వీరిలో 2,57,952 మంది బాలురు కాగా.. 2,50,433 మంది బాలికలు ఉన్నారు.

TS SSC Results 2024 Updates : రేపు ఉదయం పదో తరగతి ఫలితాలు..! ఒకే ఒక్క క్లిక్‌తో ఇలా చెక్‌ చేసుకోవచ్చు.. 2/6

5 లక్షల మందికిపైగా విద్యార్థీని విద్యార్థులు ఈ పరీక్షల ఫలితాల కోసం అతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ పరీక్ష ఫలితాల విడుదలకు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి.

TS SSC Results 2024 Updates : రేపు ఉదయం పదో తరగతి ఫలితాలు..! ఒకే ఒక్క క్లిక్‌తో ఇలా చెక్‌ చేసుకోవచ్చు.. 3/6

ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 11.00 గంటలకు విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఈ పలితాలను విడుదల చేయనున్నారు.

TS SSC Results 2024 Updates : రేపు ఉదయం పదో తరగతి ఫలితాలు..! ఒకే ఒక్క క్లిక్‌తో ఇలా చెక్‌ చేసుకోవచ్చు.. 4/6

రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ (TS SSC Spot Valuation 2024) ఏప్రిల్ 13వ తేదీ పూర్తైంది. ఈ పరీక్షా పత్రాల స్పాట్ వాల్యూయేషన్‌ను రాష్ట్రవ్యాప్తంగా 19 కేంద్రాలలో నిర్వహించారు.

TS SSC Results 2024 Updates : రేపు ఉదయం పదో తరగతి ఫలితాలు..! ఒకే ఒక్క క్లిక్‌తో ఇలా చెక్‌ చేసుకోవచ్చు.. 5/6

ఇక తెలంగాణ పదో తరగతి పరీక్షల బోర్డు అధికారిక వెబ్ సైట్ https://results.bsetelangana.org/ లోకి వెళ్లి ఫలితాలు చూసుకోవచ్చు. హోం పేజీలో కనిపించే TS SSC Results 2024 లింక్ పై క్లిక్ చేసి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. మీ పరీక్షా ఫలితాలు డిస్ ప్లే అవుతాయి. ప్రింట్ ఆప్షన్‌పై నొక్కి మార్కుల మెమోను పొందవచ్చు.

TS SSC Results 2024 Updates : రేపు ఉదయం పదో తరగతి ఫలితాలు..! ఒకే ఒక్క క్లిక్‌తో ఇలా చెక్‌ చేసుకోవచ్చు.. 6/6

అలాగే తొలిసారి తెలంగాణలో పదో తరగతి మెమోలపై పెన్ (Permanent Education Number) నెంబర్‌ను ముద్రించేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తుంది. ఓటీఆర్ తరహాలో పదవ తరగతి విద్యార్థులకు పర్మినెంట్‌ ఎడ్యుకేషన్‌ నంబర్‌ (PEN) ఉండాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ ఏడాది నుంచే ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు సమాచారం.

Updated at - Apr 29 , 2024 | 09:35 PM