Share News

సెన్సిటివ్‌ దంతాలు ఉన్నాయా?

ABN , Publish Date - May 08 , 2024 | 05:31 AM

కొందరికి చల్లని లేదా వేడి పదార్థాలు తిన్నప్పుడు దంతాలు జివ్వుమంటాయి. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్‌ పాటించాల్సిందే...

సెన్సిటివ్‌ దంతాలు ఉన్నాయా?

కొందరికి చల్లని లేదా వేడి పదార్థాలు తిన్నప్పుడు దంతాలు జివ్వుమంటాయి. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్‌ పాటించాల్సిందే.

  • దంతాల మీద ఎనామిల్‌ అనేది సున్నితమైన రక్షిత పొర. ఇది పోతే సెన్సిటివ్‌ దంతాలుగా మారతాయి. ఏది తిన్నా సమస్యనే కలుగుతుంది. ఇలాంటి వాళ్లు టూత్‌ బ్రష్‌ చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. గట్టి బ్రష్‌తో పండ్లు తోమకూడదు. సున్నితమైన బ్రష్‌లు తీసుకోవాలి. తరచూ బ్రష్‌లు మారుస్తుండాలి.

  • ఆమ్ల లక్షణాలుండే కూల్‌డ్రింక్స్‌ తాగకూడదు. పాస్ట్‌ఫుడ్స్‌, తీపి పదార్థాలు తినకూడదు. పండ్లు, కూరగాయలు తినాలి. ముఖ్యంగా పొటాషియం ఉండే అరటిపుండు, బత్తాయి పండ్లను తినాలి. పాలు, పెరుగు, డ్రైఫ్రూట్స్‌ తీసుకోవాలి.

  • జామ ఆకులు నమలడం, లవంగాలు తినడంవల్ల ఉపశమనం ఉంటుంది.

  • ఓరల్‌ హైజీన్‌ కాకున్నా కూడా కొన్ని రకాల బ్యాక్టీరియాల వల్ల ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఇలాంటి వాళ్లు రోజుకు రెండుసార్లు బ్రష్‌ చేయాలి.

  • ఈ పద్ధతులు పాటించినా ఇంకా సమస్య ఉంటే వైద్యుడిని సంప్రదించాలి.

Updated Date - May 08 , 2024 | 05:31 AM