Share News

ఆనందమే ఆరోగ్యం!

ABN , Publish Date - Apr 29 , 2024 | 05:40 AM

ఇపుడున్న పోటీ ప్రపంచంలో ఆనందం వెతుక్కున్నా దొరకనిది అయ్యింది. అయితే రొటీన్‌కి భిన్నంగా కాస్త ఆలోచిస్తే ఆనందం దొరక్కపోదు. ముఖ్యంగా ఆనందంగా ఉండటానికి ఇలాంటి టిప్స్‌ పాటించండి.

ఆనందమే ఆరోగ్యం!

ఇపుడున్న పోటీ ప్రపంచంలో ఆనందం వెతుక్కున్నా దొరకనిది అయ్యింది. అయితే రొటీన్‌కి భిన్నంగా కాస్త ఆలోచిస్తే ఆనందం దొరక్కపోదు. ముఖ్యంగా ఆనందంగా ఉండటానికి ఇలాంటి టిప్స్‌ పాటించండి.

మీ చుట్టూ నెగటివ్‌ పీపుల్‌ కాకుండా పాజిటివ్‌గా ఆలోచించేవాళ్లు ఉండేట్లు చూసుకోండి. అంటే పాజిటివ్‌ మైండ్స్‌తో కలసి తిరగటం వల్ల మంచి అలవాట్లు, అభిరుచులు కలుగుతాయి. అలా పాజిటివ్‌ ఎన్విరాన్‌మెంట్‌లో ఉంటే ఒత్తిడి తగ్గుతుంది. దీనివల్ల సంతోషంగా ఉండే అవకాశాలెక్కువ.

ఏదైనా మీరు చేసిన తప్పులను యాక్సెప్ట్‌ చేయండి. మీ తప్పులనే మీరు ఒప్పుకోవటం అంటే మీలోని మీరు జయించటమే. నెగటివిటీకి నీట్‌గా తుడిచేయటమే. అంతేనా ఎక్కువగా మాట్లాడకుండా ప్రశాంతంగా ఉండండి. మనసు ప్రశాంతంగా ఉంటే మీరూ సంతోషంగా ఉండగలరు.

మంచి ఆహారం తినటం, వ్యాయామం, చేసే పని మరింత బాగా చేయటం వల్ల ఫీల్‌గుడ్‌ ఉంటుంది. పర్ఫెక్ట్‌ డైట్‌ వల్ల ఎనర్జిటిక్‌గా ఉంటారు. తద్వారా మంచి నిద్ర పడుతుంది. దీనివల్ల ఆనందం కలుగుతుంది.

ఎక్కువ సమయం మీతో మీరు గడపండి. ఏమీ పని లేకుంటే సెల్ఫ్‌కేర్‌ తీసుకోవాలి అంటారు. పుస్తకం చదవటం, జిమ్‌కు వెళ్లటం, ఒంటరిగా తిరగటం, విశ్రాంతి తీసుకోవటం.. లాంటివి చేయటం వల్ల మైండ్‌ ప్రశాంతంగా ఉంటుంది. దీంతో ఆనందం సొంతమవుతుంది.

కంప్యూటర్‌ స్ర్కీన్‌, ఫోన్‌లో ఇంటర్నెట్‌ చూడటం లాంటివి అధికంగా చేస్తే ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. అందుకే డిజిటల్‌ డిటాక్స్‌ చేయాలి. నెట్‌ సమయాన్ని తగ్గించుకుని నిజమైన ప్రపంచంలో బతకాలి. అప్పుడే ఆనందం వెల్లివిరుస్తుంది.

ఇతరుల పట్ల దయ, జాలి, మర్యాద లాంటివి ఇవ్వటంతో పాటు క్షమించే గుణం అలవరుచుకోవటం మంచిదే. దీనివల్ల మీలో నెగటివ్‌ ఎమోషన్స్‌ తగ్గిపోతాయి. ఎనర్జిటిక్‌గా ఫీల్‌ అవుతారు. కొత్త వస్తువులు, కొత్త ప్రదేశాలు తిరగటం వల్ల కూడా గ్రేట్‌గా ఫీల్‌ అయ్యే అవకాశాలెక్కువ.

Updated Date - Apr 29 , 2024 | 06:09 AM