బంధనీ భళా
ABN , Publish Date - May 08 , 2024 | 05:34 AM
లెహంగా ట్రెండ్ ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. అయితే వేడుకల్లో ధరించే లెహంగా రెట్టింపు ప్రత్యేకంగా ఉండాలంటే, రాజస్థానీ బంధనీ లెహంగా ధరించాలి. ఆకర్షణీయమైన రంగుల్లో, డిజైన్లలో...
ఫ్యాషన్
లెహంగా ట్రెండ్ ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. అయితే వేడుకల్లో ధరించే లెహంగా రెట్టింపు ప్రత్యేకంగా ఉండాలంటే, రాజస్థానీ బంధనీ లెహంగా ధరించాలి. ఆకర్షణీయమైన రంగుల్లో, డిజైన్లలో తయారయ్యే ఈ రకం లెహంగా ఎంచుకుంటే వేడుకల్లో మీరే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్.
బంధనీ లెహంగా ధరిస్తే నగల అలంకరణ మరీ హెవీగా ఉండకూడదు. చెవులకు ఝుంకాలు, మెడలో సన్నని చైన్, చేతికి కంగన్ సరిపోతుంది.
లెహంగాకు తగిన చోళీ, చున్నీ జోడిస్తేనే బంధనీ లెహంగాకు అందం చేకూరుతుంది. అందు కోసం కాంట్రాస్ట్ రంగుల్లో చోళీ ఎంచుకోవాలి. లెహంగాకు చున్నీ మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి. ఎరుపు రంగు లెహంగాకు ఆకుపచ్చ, పసుపు చోళీలు బాగుంటాయి.
జరీ జోడిస్తే ఎలాంటి దుస్తులకైనా భారీ లుక్ చేకూరుతుంది. బంధనీ లెహెంగా మరింత భారీగా కనిపించాలంటే అర అడుగు వెడల్పు ఉండే జరీ బార్డర్ జోడించాలి. బ్లౌజ్ గోల్డ్ కలర్‌లో ఉంటే పెళ్లిళ్ల లాంటి వేడుకల్లో ధగధగలాడిపోవచ్చు.