Share News

కేజ్రీవాల్‌కు ‘బెయిల్‌’ పరిశీలిస్తాం

ABN , Publish Date - May 04 , 2024 | 02:44 AM

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది.

కేజ్రీవాల్‌కు ‘బెయిల్‌’ పరిశీలిస్తాం

న్యూఢిల్లీ, మే 3 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తనకు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్‌ సుప్రీం కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు విచారించింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ దాఖలు చేసిన కేసు విచారణకు సమయం పట్టే అవకాశం ఉందని, కానీ ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికలు ఉన్నందున కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను తాము వ్యతిరేకిస్తామని ఈడీ తరపున అడిషినల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎస్పీ రాజు ధర్మాసనానికి స్పష్టం చేశారు. దీంతో.. ఇరువురి వాదనలు విన్న తర్వాత బెయిల్‌ ఇవ్వాలా? లేదా? అనేది ధర్మాసనం నిర్ణయిస్తుందని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. ఈ నెల 7న ఇరు వాదనలు వింటామని చెప్పారు.

Updated Date - May 04 , 2024 | 06:46 AM