Share News

DD News: డీడీ న్యూస్ రంగు మార్పుపై దుమారం.. బీజేపీ ప్రచారభారతిగా మారిందని విమర్శలు

ABN , Publish Date - Apr 20 , 2024 | 04:54 PM

భారత ప్రభుత్వ నిర్వహణలోని దూరదర్శన్‌ చానెల్‌(Doordarshan) తన లోగో రంగును(Logo) కాషాయం రంగులోకి మార్చడం పెను దుమారాన్ని రేపుతోంది. రంగు మార్పుపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. డీడీ న్యూస్ మాజీ సీఈవో, టీఎంసీ ఎంపీ జవహర్ సిర్కార్ మాట్లాడుతూ.. డీడీ లోగో కాషాయం రంగులోకి మారడం బాధ కలిగించిందని అన్నారు.

DD News: డీడీ న్యూస్ రంగు మార్పుపై దుమారం.. బీజేపీ ప్రచారభారతిగా మారిందని విమర్శలు

ఢిల్లీ: భారత ప్రభుత్వ నిర్వహణలోని దూరదర్శన్‌ చానెల్‌(Doordarshan) తన లోగో రంగును(Logo) కాషాయం రంగులోకి మార్చడం పెను దుమారాన్ని రేపుతోంది. రంగు మార్పుపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. డీడీ న్యూస్ మాజీ సీఈవో, టీఎంసీ ఎంపీ జవహర్ సిర్కార్ మాట్లాడుతూ.. డీడీ లోగో కాషాయం రంగులోకి మారడం బాధ కలిగించిందని అన్నారు.

దూరదర్శన్ కాస్త.. ప్రసార భారతి నుంచి ప్రచార భారతిగా మారిందని ఎద్దేవా చేశారు. సిర్కార్ 2012 నుంచి 2016 వరకు డీడీ, ఆల్ ఇండియా రేడియో సీఈవోగా పని చేశారు. బీజేపీ తమ ప్రచారం కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఛానల్‌ లోగో రంగు మార్చిందన్నారు. ఈ పద్ధతి సరికాదని.. ఈసీ జారీ చేసే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌‌ను ఉల్లంఘించడమేనని ఆరోపించారు. ఆయన ఆరోపణలను డీడీ న్యూస్ సీఈవో గౌరవ్ ఖండించారు. చూపరులకు అందంగా కనిపించడానికి ఆకర్షణీయంగా ఉండే కాషాయ రంగును లోగోలో వాడామని తెలిపారు.


కేవలం లోగో మాత్రమే కాకుండా, కొత్త లైటింగ్, పరికరాలతో సహా ఛానల్ రూపురేఖల్ని మార్చేశామన్నారు. డీడీ న్యూస్ సంస్థ ప్రారంభమైన నాటి నుంచి ఎరుపు రంగులో ఉన్న లోగో తాజాగా కాషాయంలోకి మార్చారు. ఏప్రిల్‌ 16 నుంచి ఇది అమల్లోకి వచ్చినట్లు సోషల్‌ మీడియా ద్వారా డీడీ న్యూస్‌ ప్రకటించింది.

PM Modi: రాహుల్.. నిన్ను వాయనాడ్ నుంచి తరిమికొడతారు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

ఈ సందర్భంగా... లోగో మారింది తప్ప చానెల్‌ విలువల్లో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. ‘‘వేగం కంటే కచ్చితత్వాన్ని, అబద్ధాల కంటే నిజాన్ని, సంచలనాల కంటే సత్యాన్ని మాత్రమే ముందుంచే దూరదర్శన్‌... తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది’’ అని పోస్ట్‌ చేసింది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 20 , 2024 | 04:55 PM