Share News

పేరు ఒకేలా ఉన్నంత మాత్రాన పోటీ చేయొద్దనలేం

ABN , Publish Date - May 04 , 2024 | 02:43 AM

రాజకీయ నాయకుడి పేరు కలిగి ఉన్నంత మాత్రాన ఎన్నికల్లో పోటీ చేయకూడదంటూ ఏ వ్యక్తినీ నిలువరించలేమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

పేరు ఒకేలా ఉన్నంత మాత్రాన పోటీ చేయొద్దనలేం

న్యూఢిల్లీ, మే 3: రాజకీయ నాయకుడి పేరు కలిగి ఉన్నంత మాత్రాన ఎన్నికల్లో పోటీ చేయకూడదంటూ ఏ వ్యక్తినీ నిలువరించలేమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పేరును ఆధారం చేసుకొని ఎన్నికల్లో పోటీ చేసే హక్కును దూరం చేయలేమని పేర్కొంది. ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థి పేరును పోలిన అభ్యర్థులు కేవలం నామమాత్రంగా పోటీలో ఉంటున్నారని ఇలాంటి వారిని నిలువరించాలని కోరుతూ సాబు స్టీఫెన్‌ అనే వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేశారు. ఇది ఓటర్లలో గందరగోళం సృష్టించడానికి ప్రత్యర్థులు అవలంబించే పాత ట్రిక్‌ అని ఆరోపించారు. ఇలాంటి ఎత్తుగడల నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని, నామ మాత్ర అభ్యర్థులను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘ఎవరైనా తల్లిదండ్రులు పిల్లలకు రాజకీయ నాయకుని పేరు పెడితే ఆ పిల్లలకు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉండదా?’’ అని ప్రశ్నించింది.

Updated Date - May 04 , 2024 | 06:57 AM