Share News

Coconut Water: శరీరంలో నీటి కొరత లేకుండా ఉండాలంటే కొబ్బరి నీరు ఎప్పుడు తాగాలి?

ABN , Publish Date - Apr 29 , 2024 | 03:03 PM

ఆరోగ్యం బాలేనప్పుడు, బాగా దాహంగా అనిపించినప్పుడు కొబ్బరి నీరు తాగుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా వేసవికాలంలో కొబ్బరి నీళ్లకు డిమాండ్ ఎక్కువ. వేసవిలో మండే వేడి నుండి శరీరాన్ని సురక్షితంగా, హైడ్రేట్‌గా ఉంచడంలో ది బెస్ట్ డ్రింక్ కొబ్బరి నీరు అని చెప్పవచ్చు.

Coconut Water: శరీరంలో నీటి కొరత లేకుండా ఉండాలంటే కొబ్బరి నీరు ఎప్పుడు తాగాలి?

కొబ్బరి నీళ్లను మ్యాజికల్ డ్రింక్ అంటారు. ఇది బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఆరోగ్యం బాలేనప్పుడు, బాగా దాహంగా అనిపించినప్పుడు కొబ్బరి నీరు తాగుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా వేసవికాలంలో కొబ్బరి నీళ్లకు డిమాండ్ ఎక్కువ. వేసవిలో మండే వేడి నుండి శరీరాన్ని సురక్షితంగా, హైడ్రేట్‌గా ఉంచడంలో ది బెస్ట్ డ్రింక్ కొబ్బరి నీరు అని చెప్పవచ్చు. కొబ్బరి నీరు శక్తిని పెంచే పానీయం, కేలరీలు తక్కువగా ఉంటాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడే సహజ ఎంజైమ్‌లు ఇందులో ఉంటాయి. ఎండాకాలంలో శరీరంలో నీటి కొరత రాకుండా ఉండాలంటే కొబ్బరి నీళ్లను ఎప్పుడు తాగితే మేలు తెలుసుకుంటే..

వర్కవుట్ చేసే ముందు, తర్వాత కొబ్బరినీళ్లు తాగవచ్చు. కొబ్బరి నీరు ఒక హైడ్రేటింగ్ పానీయం. శరీరానికి శక్తిని ఇస్తుంది. కాబట్టి ఇది శక్తిని పెంచే పానీయంగా వ్యాయామం చేయడానికి ముందు, తర్వాత త్రాగవచ్చు.

ఈ ఆహారాలను పొరపాటున కూడా కలిపి తినకండి..!


కొబ్బరి నీళ్లు మధ్యాహ్నం పూట తాగితే జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను దూరంగా ఉంచుతుంది. ఆహారం తిన్న తర్వాత ఉబ్బరం కలిగించదు. కొబ్బరి నీరు శరీరంలోని ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేస్తుంది. ఇది రక్తపోటును నియంత్రించగలదు.

రాత్రిపూట నిద్రపోయే ముందు కొబ్బరి నీళ్ళు తాగితే, దాని వాసన వ్యక్తిపై మానసిక ప్రభావాలను కలిగి ఉంటుంది. ఇది ఆందోళనను తగ్గించడంలో ప్రభావం చూపుతుంది. నిద్రపోయే ముందు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే శరీరంలోని టాక్సిన్‌లను బయటకు పంపడంలో సహాయపడుతుంది.

ఈ ఆహారాలను పొరపాటున కూడా కలిపి తినకండి..!

ఈ కుక్క జాతులు సింహాన్ని సైతం చంపగలవు..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 29 , 2024 | 03:03 PM