Share News

టెక్‌ వ్యూ : నిరోధ స్థాయిల్లో పరీక్ష

ABN , Publish Date - Apr 29 , 2024 | 06:25 AM

నిఫ్టీ గత వారం పాజిటివ్‌గానే ప్రారంభమైనా 22620 వద్ద కరెక్షన్‌లో పడింది. చివరికి గత వారం కన్నా 270 పాయింట్ల లాభంతో వారం గరిష్ఠ, కనిష్ఠ స్థాయిల నడుమన ముగిసింది...

టెక్‌ వ్యూ : నిరోధ స్థాయిల్లో పరీక్ష

టెక్‌ వ్యూ : నిరోధ స్థాయిల్లో పరీక్ష

నిఫ్టీ గత వారం పాజిటివ్‌గానే ప్రారంభమైనా 22620 వద్ద కరెక్షన్‌లో పడింది. చివరికి గత వారం కన్నా 270 పాయింట్ల లాభంతో వారం గరిష్ఠ, కనిష్ఠ స్థాయిల నడుమన ముగిసింది. టెక్నికల్‌గా గత రెండు నెలలుగా సైడ్‌వేస్‌ ధోరణిలో 22700, 21700 పరిధికే పరిమితమై ఉంది. ఇదిలా ఉండగా గత వారం మిడ్‌క్యాప్‌ 100 ఇండెక్స్‌ 1920 పాయింట్లు, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 700 పాయింట్లు లాభపడి జీవితకాల గరిష్ఠ స్థాయిల్లో ఉన్నాయి. ప్రధాన ట్రెండ్‌ ఇప్పటికీ ఎగువకే ఉన్నప్పటికీ నిఫ్టీ మరోసారి జీవితకాల గరిష్ఠ స్థాయిలకు చేరువవుతోంది. ప్రపంచ మార్కెట్ల తీరును బట్టి ఈ వారంలో మార్కెట్‌ పాజిటివ్‌గానే ప్రారంభమై జీవితకాల గరిష్ఠ స్థాయిల్లో పరీక్ష ఎదుర్కొనవచ్చు.


బుల్లిష్‌ స్థాయిలు: పాజిటివ్‌ ధోరణిలో ప్రారంభమైతే నిరోధ స్థాయిలు 22500, 22650 వద్ద నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. ఆ పైన మరో నిరోధం 22800. ఇక్కడ నుంచే మార్కెట్‌ గతంలో 1000 పాయింట్ల మేరకు కరెక్షన్‌కు లోనయింది. మరింత అప్‌ట్రెండ్‌ కోసం నిఫ్టీ జీవితకాల గరిష్ఠ స్థాయిల్లో నిలదొక్కుకోవాలి. మానసిక అవధి 23000.

బేరిష్‌ స్థాయిలు: నిరోధ స్థాయి 22500 వద్ద నిలదొక్కుకోవడంలో విఫలమైతే బలహీనపడే ఆస్కారం ఉంటుంది. మద్దతు స్థాయి 22300. ఇక్కడ కూడా విఫలమైతే మరింత బలహీనపడుతుంది. ప్రధాన మద్దతు స్థాయి 22000.

బ్యాంక్‌ నిఫ్టీ: గత వారం మైనర్‌ రికవరీ సాధించిన ఈ సూచీ 620 పాయింట్ల మేరకు లాభపడి 48200 వద్ద ముగిసింది. ఇప్పుడు ఇటీవల తాకిన గరిష్ఠ స్థాయిల్లో పరీక్ష ఎదుర్కొనేందుకు సమాయత్తం అవుతోంది. అయితే జీవితకాల గరిష్ఠ స్థాయి 49000 కన్నా చాలా దిగువన ఉంది. పాజిటివ్‌ ధోరణిలో ట్రేడయితే నిరోధ స్థాయి 48600 కన్నా పైన నిలదొక్కుకోవాల్సి ఉంది. ఆ పైన నిరోధం 49000. బలహీనపడితే దిగువన మద్దతు స్థాయిలు 48000, 47600.


పాటర్న్‌ : మార్కెట్‌ మధ్యకాలిక ఓవర్‌బాట్‌ స్థితిలో ఉంది. గత వారం 50 డిఎంఏ వద్ద కోలుకుంది. భద్రత కోసం 22650 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద నిలదొక్కుకోవాలి.

టైమ్‌ : ఈ సూచీ ప్రకారం గురువారం తదుపరి రివర్సల్‌ ఉండవచ్చు.

సోమవారం స్థాయిలు

నిరోధం : 22,500, 22,555

మద్దతు : 22,400, 22,345

వి. సుందర్‌ రాజా

Updated Date - Apr 29 , 2024 | 06:25 AM