సెలెక్ట్ మొబైల్స్ 6వ వార్షికోత్సవ ఆఫర్లు
ABN , Publish Date - May 04 , 2024 | 05:42 AM
సెలెక్ట్ మొబైల్స్ 6వ వార్షికోత్సవ ఆఫర్లను ప్రకటించింది. ఈ నెల 3 నుంచి జూన్ 4 వరకు ఈ వార్షికోత్సవ మెగా సేల్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని సెలెక్ట్ సీఎండీ వై గురు వెల్లడించారు...
హైదరాబాద్: సెలెక్ట్ మొబైల్స్ 6వ వార్షికోత్సవ ఆఫర్లను ప్రకటించింది. ఈ నెల 3 నుంచి జూన్ 4 వరకు ఈ వార్షికోత్సవ మెగా సేల్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని సెలెక్ట్ సీఎండీ వై గురు వెల్లడించారు. వార్షికోత్సవ ఆఫర్లలో భాగంగా ప్రతి మొబైల్ కొనుగోలుపై ఉచిత బహుమతులతో పాటు సరికొత్త స్మార్ట్‌ఫోన్స్‌పై ప్రత్యేక ఆఫర్లను ఇస్తున్నట్లు చెప్పారు. అలాగే ల్యాప్‌టాప్, యాక్సెసరీ్సకు కూడా ఈ ఆఫర్లను అందిస్తున్నట్లు గురు తెలిపారు. మొబైల్ కొనుగోలుపై స్మార్ట్ టీవీ, కూలర్, ఫ్రంట్‌లోడ్ వాషింగ్ మెషిన్ లాంటి బహుమతులను ఉచితంగా ఇస్తున్నట్లు చెప్పారు. బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై 60 శాతం వరకు డిస్కౌంట్, ఎస్బీఐ కార్డ్‌పై 7.5 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్, బజాజ్ ఫైనాన్స్ ద్వారా చేసే కొనుగోలుపై రూ.4,000 వరకు ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్‌ను వినియోగదారులకు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రత్యేక ఆఫర్లు అన్ని సెలెక్ట్ మొబైల్స్ స్టోర్లలో అందుబాటులో ఉంటాయని గురు తెలిపారు.