Share News

ఫీనిక్స్‌ నుంచి కార్యాలయ స్థలం కొనుగోలు : క్లింట్‌

ABN , Publish Date - May 04 , 2024 | 05:39 AM

ఫీనిక్స్‌ గ్రూప్‌ హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో నిర్మిస్తున్న 25 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు క్యాపిటాల్యాండ్‌...

ఫీనిక్స్‌ నుంచి కార్యాలయ స్థలం కొనుగోలు : క్లింట్‌

హైదరాబాద్‌: ఫీనిక్స్‌ గ్రూప్‌ హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో నిర్మిస్తున్న 25 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు క్యాపిటాల్యాండ్‌ ఇండియా ట్రస్ట్‌ (క్లింట్‌) ప్రకటించింది. ఈ ప్రదేశాన్ని నిర్మాణం పూర్తయిన అనంతరం తాము కొనుగోలు చేయనున్నట్టు తెలిపింది. ఈ ఒప్పందం కింద ఫీనిక్స్‌ గ్రూప్‌ అధిక వడ్డీకి తీసుకున్న రుణం రీఫైనాన్స్‌ కోసం క్లింట్‌ రూ.215 కోట్లు అందిస్తుంది. ఆ తర్వాత కూడా భవన నిర్మాణం పూర్తయ్యే వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది.ఈ ముందస్తు కొనుగోలు హైదరాబాద్‌లో తమ స్థానాన్ని పటిష్ఠం చేస్తుందని క్యాపిటాల్యాండ్‌ ఇండియా ట్రస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఈఓ సంజీవ్‌ దాస్‌ గుప్తా తెలిపారు. కాగా అవాన్సే హైదరాబాద్‌, సైబర్‌పెరల్‌, ఇంటర్నేషనల్‌ టెక్‌ పార్క్‌ హైదరాబాద్‌ ఇప్పటికే క్లింట్‌ పోర్టుఫోలియోలో ఉన్నాయి.

Updated Date - May 04 , 2024 | 05:39 AM