Share News

కన్సాలిడేషన్‌కు అవకాశం

ABN , Publish Date - Apr 29 , 2024 | 06:28 AM

స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈ వారం మిశ్రమంగా చ లించే అవకాశం ఉంది. ఇప్పటికే గరిష్ఠ స్థాయిలకు చేరిన సూచీలకు, ఆ స్థాయిలో నిలదొక్కుకునేందుకు బలం అవసరం. దీంతో కొంత కన్సాలిడేషన్‌...

కన్సాలిడేషన్‌కు అవకాశం

స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈ వారం మిశ్రమంగా చ లించే అవకాశం ఉంది. ఇప్పటికే గరిష్ఠ స్థాయిలకు చేరిన సూచీలకు, ఆ స్థాయిలో నిలదొక్కుకునేందుకు బలం అవసరం. దీంతో కొంత కన్సాలిడేషన్‌ జరిగే అవకాశం కనిపిస్తోంది. క్యూ4 ఫలితాలతో బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ కంపెనీల షేర్లలో బుల్లిష్‌నెస్‌ ఉండొచ్చు. మదుపరులు అంతర్జాతీయ సంకేతాలను జాగ్రత్తగా గమనించాలి. యుద్ధం నేపథ్యంలో అప్రమత్తత తప్పనిసరి. నిఫ్టీకి ఈ వారం 22,500 వద్ద మద్దతు దొరికే అవకాశం ఉంది. అప్‌ట్రెండ్‌ కొనసాగినా 22,700 వద్ద రెసిస్టెన్స్‌ ఎదురు కావచ్చు.

ఈ వారం స్టాక్‌ రికమండేషన్స్‌

హావెల్స్‌ : ఈ స్టాక్‌కి అనేక సానుకూల అంశాలు కనిపిస్తున్నాయి. గత ఐదు రోజుల్లో సగటు వాల్యూమ్స్‌ మూడు రెట్లు పెరిగాయి. గతంలో నమోదైన రూ.1,591 ఆల్‌టైమ్‌ హైని కూడా బ్రేక్‌ చేసింది. రూ.1,640 వద్ద అప్పర్‌ బొలింజర్‌ బ్యాండ్‌ను క్రాస్‌ చేసింది. శుక్రవారం ఏకంగా 5.09 శాతం పెరిగి రూ.1,640 వద్ద ముగిసింది. రూ.1,680/1,729 టార్గెట్‌తో మదుపరులు ఈ కౌంటర్లో రూ.1,630/1,610 వద్ద పొజిషన్లు తీసుకోవచ్చు. అయితే రూ.1,600ని గట్టి స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.

కోల్గేట్‌ పామోలివ్‌: నిఫ్టీతో పోలిస్తే ఈ కౌంటర్‌ మెరుగ్గా ట్రేడవుతోంది. డెలివరీ వాల్యూమ్స్‌ కూడా క్రమం గా పెరుగుతున్నాయి. ఈ కంపెనీ షేర్లు దీర్ఘకాలంగా అప్‌ట్రెండ్‌లో కొనసాగుతుండటం విశేషం. ఇటీవలే ఈ కంపెనీ షేర్లు రూ.2,815 వద్ద ఆల్‌టైమ్‌ హైని బ్రేక్‌ చేశాయి. క్యూ4 ఆర్థిక ఫలితాలు బాగుంటాయనే అంచనాలు, ఈ కౌంటర్‌కు మరో సానుకూల అంశం. శుక్రవారం 1.96 శాతం లాభంతో రూ.2,855 వద్ద ముగిసింది. మదుపరులు ఈ కౌంటర్లో రూ.2,920/2,950 టార్గెట్‌తో రూ.2,850 వద్ద పొజిషన్లు తీసుకోవచ్చు. అయితే రూ.2,810ని కచ్చితమైన స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.

యాక్సిస్‌ బ్యాంక్‌: క్యూ4లో ఈ బ్యాంకు మంచి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే రూ.5,362 కోట్ల నష్టాల నుంచి రూ.7,599 కోట్ల లాభం నమోదు చేసింది. మొండి బకాయిలు కూడా తగ్గాయి. నిఫ్టీతో పోలిస్తే గత ఏడాది కాలంలో యాక్సిస్‌ బ్యాంకు షేర్లే వేగంగా పెరిగాయి. జీవిత కాల గరిష్ఠ స్థాయి తర్వాత కన్సాలిడేషన్‌ జరిగి బ్రేకౌట్‌ స్థాయికి చేరింది. మదుపరులు రూ.1,190/1,225 లక్ష్యంతో రూ.1,120/1,100 వద్ద ఈ కౌంటర్లో పొజిషన్లు తీసుకోవచ్చు. అయితే రూ.1,080ని గట్టి స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.

జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా: గత రెండు వారాలుగా ఈ కౌంటర్లో మూమెంటమ్‌ కనిపిస్తోంది. స్వల్పకాలిక అడ్డంకిని కూడా అధిగమించింది. జీవిత కాల గరిష్ఠ స్థాయిని అధిగమించేందుకూ సిద్ధంగా ఉంది. నిఫ్టీతో పోలిస్తే జోరు ప్రదర్శిస్తోంది. ట్రేడింగ్‌, డెలివరీ వాల్యూమ్స్‌ గణనీయంగా పెరిగాయి. సైడ్‌వేస్‌లో చలిస్తున్నప్పటికీ మదుపరులు ఈ స్టాక్‌ను వదులుకునేందుకు ఇష్టప డడం లేదు. రూ.95/106 లక్ష్యంతో మదుపరులు ఈ కౌంటర్లో రూ.88 వద్ద పొజిషన్లు తీసుకోవచ్చు. రూ.85ని కచ్చితమైన స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.

ఇంజనీర్స్‌ ఇండియా: సుదీర్ఘ కాలంగా ఈ కంపెనీ షేర్లు అప్‌ట్రెండ్‌లో కొనసాగుతున్నాయి. కౌంటర్లో దిద్దు బాటు దాదాపుగా ముగిసింది. ఇటీవల ఈ కౌంటర్లో డెలివరీ వాల్యూమ్స్‌ పెరుగుతున్నాయి.

గత వారం 6.67 శాతం లాభంతో రూ.236 వద్ద స్వల్పకాలిక అడ్డంకిని అధిగమించింది. రూ.265/290 టార్గెట్‌తో మదుపరులు ఈ కౌంటర్లో రూ.235 వద్ద పొజిన్లు తీసుకునే విషయాన్ని పరిశీలింవచ్చు. అయితే రూ.231ని గట్టి స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.

మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్టీ మాస్టర్‌

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

Updated Date - Apr 29 , 2024 | 06:28 AM