Share News

మారుతి కొత్త ‘స్విఫ్ట్‌’

ABN , Publish Date - May 10 , 2024 | 02:20 AM

ఆటో దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా (ఎంఎ్‌సఐ) సరికొత్త ఫీచర్లతో కొత్త స్విఫ్ట్‌ హ్యాచ్‌బ్యాక్‌ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు ధరలు రూ.6.49 లక్షల నుంచి రూ.9.64 లక్షల (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌) మధ్యన...

మారుతి కొత్త ‘స్విఫ్ట్‌’

న్యూఢిల్లీ: ఆటో దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా (ఎంఎ్‌సఐ) సరికొత్త ఫీచర్లతో కొత్త స్విఫ్ట్‌ హ్యాచ్‌బ్యాక్‌ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు ధరలు రూ.6.49 లక్షల నుంచి రూ.9.64 లక్షల (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌) మధ్యన ఉన్నాయి. ఈ ప్రీమియం హాచ్‌బ్యాక్‌ మోడల్‌ అభివృద్ధి కోసం రూ.1,450 కోట్లు ఖర్చు చేసినట్టు కంపెనీ ఎండీ, సీఈఓ హిసాచి టకెయుచి చెప్పారు. పర్యావరణానికి హాని చేయని జెడ్‌ సీరిస్‌ 1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజన్‌తో ఈ హ్యాచ్‌బ్యాక్‌ను తీసుకువచ్చినట్లు తెలిపారు. గుజరాత్‌ ప్లాంట్‌లో ఈ కొత్త మోడల్‌ స్విఫ్ట్‌ కారు తయారవుతుందన్నారు. ఇక తమ దృష్టి అంతా హ్యాచ్‌బ్యాక్‌ కార్లపైనే ఉంటుందన్నారు. 2030 కల్లా భారత్‌లో 40 లక్షల కార్ల ఉత్పత్తి తమ లక్ష్యమన్నారు. లీటర్‌ పెట్రోల్‌తో 25.75 కిలోమీటర్ల మైలేజీ, ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌ ఈ కారు ప్రత్యేకతలు.

Updated Date - May 10 , 2024 | 02:20 AM