Share News

భారత్‌కు భారీగా పెరిగిన చైనా ఎగుమతులు

ABN , Publish Date - Apr 29 , 2024 | 06:16 AM

చైనా పెద్ద ఎత్తున తన సరుకులను భారత్‌లో కుమ్మరిస్తోంది. గత 15 సంవత్సరాలుగా చైనాకు మన ఎగుమతులు 1,600 కోట్ల డాలర్లు మించడం లేదు. అయితే ఇదే సమయంలో చైనా నుంచి మన పారిశ్రామిక వస్తువుల దిగుమతులు 7,030 కోట్ల డాలర్ల...

భారత్‌కు భారీగా పెరిగిన చైనా ఎగుమతులు

న్యూఢిల్లీ: చైనా పెద్ద ఎత్తున తన సరుకులను భారత్‌లో కుమ్మరిస్తోంది. గత 15 సంవత్సరాలుగా చైనాకు మన ఎగుమతులు 1,600 కోట్ల డాలర్లు మించడం లేదు. అయితే ఇదే సమయంలో చైనా నుంచి మన పారిశ్రామిక వస్తువుల దిగుమతులు 7,030 కోట్ల డాలర్ల నుంచి 10.100 కోట్ల డాలర్లకు పెరిగినట్టు గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనీషియేటివ్‌ (జీటీఆర్‌ఐ) తెలిపింది. ప్రస్తుతం మన దేశ పారిశ్రామిక వస్తువుల దిగుమతుల్లో చైనా వాటా 30 శాతం. పదిహేనేళ్ల క్రితం ఇది 21 శాతం మాత్రమే. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నా, చైనా నుంచి దిగుమతులు భారీగా పెరగడం విశేషం. ఇది మన ఆర్థిక వ్యవస్థకుగానీ, దేశ భద్రతకుగానీ ఏ మాత్రం మంచిది కాదని జీటీఆర్‌ఐ తెలిపింది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని చైనా దిగుమతులపై ఆధారపడడం తగ్గించుకునేందుకు వేరే దేశాల నుంచి దిగుమతుల కోసం ప్రభుత్వం, పారిశ్రామిక సంస్థలు దృష్టి పెట్టాలని జీటీఆర్‌ఐ సంస్థ వ్యవస్థాపకులు అజయ్‌ శ్రీవాస్తవ చెప్పారు.

Updated Date - Apr 29 , 2024 | 06:16 AM