Share News

అరబిందో ఫార్మాకు జీఎస్‌టీ నోటీసు

ABN , Publish Date - May 04 , 2024 | 05:41 AM

తప్పుడు ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ క్లెయిమ్‌ అభియోగంపై అరబిందో ఫార్మాకు జీఎ్‌సటీ అధికారుల నుంచి వడ్డీ, పెనాల్టీ సహా రూ.13 కోట్ల డిమాండ్‌ నోటీసు అందింది...

అరబిందో ఫార్మాకు జీఎస్‌టీ నోటీసు

హైదరాబాద్‌: తప్పుడు ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ క్లెయిమ్‌ అభియోగంపై అరబిందో ఫార్మాకు జీఎ్‌సటీ అధికారుల నుంచి వడ్డీ, పెనాల్టీ సహా రూ.13 కోట్ల డిమాండ్‌ నోటీసు అందింది. హైదరాబాద్‌లోని పంజాగుట్ట డివిజన్‌ డిప్యూటీ కమిషనర్‌ (ఎస్‌టీ) ఎస్‌టీయూ-1 నుంచి ఈ పన్ను నోటీసు అందినట్టు అరబిందో ఫార్మా రెగ్యులేటరీ సంస్థలకు పంపిన ప్రకటనలో తెలిపింది.

రూ.6,54,50,645 ఐటీసీ రివర్సల్‌తో పాటు వడ్డీగా రూ.5,92,20,900, పెనాల్టీగా రూ.65,51,354 చెల్లించాలని ఆ నోటీసులో ఆదేశించినట్టు పేర్కొంది. దీనిపై అప్పిలేట్‌ యంత్రాంగం ముందు అప్పీల్‌ చేయనున్నట్టు కూడా తెలియచేసింది. తమ ఆర్థిక వ్యవహారాలపై గాని, కంపెనీ కార్యకలాపాలపై గాని దీని ప్రభావం ఉండబోదని స్పష్టం చేసింది.

Updated Date - May 04 , 2024 | 05:41 AM