Share News

ఎఫ్‌ఐయూ తాజా అలర్ట్‌ సూచీలు జారీ

ABN , Publish Date - Apr 29 , 2024 | 06:17 AM

మనీ లాండరింగ్‌, ఉగ్రవాద చర్యలకు ఫైనాన్సింగ్‌ వంటి కార్యకలాపాలను అడ్డుకునేందుకు ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఎఫ్‌ఐయూ) బరిలోకి దిగింది. పెట్టుబడి మార్కెట్లు, బీమా కంపెనీలు...

ఎఫ్‌ఐయూ తాజా అలర్ట్‌  సూచీలు జారీ

న్యూఢిల్లీ: మనీ లాండరింగ్‌, ఉగ్రవాద చర్యలకు ఫైనాన్సింగ్‌ వంటి కార్యకలాపాలను అడ్డుకునేందుకు ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఎఫ్‌ఐయూ) బరిలోకి దిగింది. పెట్టుబడి మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్‌లైన్‌ పేమెంట్‌ గేట్‌వే ఇంటర్మీడియేటరీలు, క్రిప్టో సర్వీస్‌ ప్రొవైడర్ల ద్వారా అక్రమ నిధులు తరలి వెళ్లడాన్ని నిలువరించేందుకు తాజా ‘‘అలర్ట్‌ సూచీ’’లు విడుదల చేసింది. మనీలాండరింగ్‌ చర్యల నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద 2022-23లో జారీ చేసిన ఈ మార్గదర్శకాలను ఇటీవలే ప్రచురించారు. దీని కింద ఆర్థిక సంస్థలు, ఇంటర్మీడియేటరీలన్నీ అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన నివేదికలను (ఎస్‌టీఆర్‌) ఎఫ్‌ఐయూకి అందచేయాల్సి ఉంటుంది. ఎఫ్‌ఐయూ వాటిని విశ్లేషించి తగు కార్యాచరణ కోసం దర్యాప్తు, గుఢచర్య సంస్థలకు అందచేస్తుంది. ఈ అలర్ట్‌ సూచీలు స్టాక్‌ ఎక్స్ఛేంజిలు, డిపాజిటరీల వంటి మార్కెట్‌ మౌలిక వసతుల సంస్థలకు ఎదురయ్యే ముప్పు గురించి హెచ్చరిస్తూ ఉంటాయి.

Updated Date - Apr 29 , 2024 | 06:17 AM