Share News

బ్యాంకు రుణాల జోరుకి కళ్లెం తప్పదు : ఎస్‌ అండ్‌పీ

ABN , Publish Date - Apr 29 , 2024 | 06:15 AM

ప్రస్తుతం దేశం బలమైన వృద్ధిపథంలో ముందు కు సాగుతున్న క్రమంలో బ్యాంకుల రుణవృద్ధి, లాభదాయకత, ఆస్తుల నాణ్యత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌...

బ్యాంకు రుణాల జోరుకి కళ్లెం తప్పదు : ఎస్‌ అండ్‌పీ

న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశం బలమైన వృద్ధిపథంలో ముందు కు సాగుతున్న క్రమంలో బ్యాంకుల రుణవృద్ధి, లాభదాయకత, ఆస్తుల నాణ్యత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ తెలిపింది. అయితే డిపాజిట్లు అదే వేగంలో వృద్ధి చెందకపోవడం వల్ల రుణవృద్ధికి బ్యాంక్‌లు కళ్లెం వేసుకోక తప్పని పరిస్థితి నెలకొన్నదని పేర్కొంది. 2024 ఆర్థిక సంవత్సరవంలో రుణవృద్ధి 16 శాతం ఉండగా కొత్త ఆర్థిక సంవత్సరంలో అది 14 శాతానికే పరిమితం కావచ్చునని అంచనా వేసింది. సుమారుగా అన్ని బ్యాంకుల రుణ-డిపాజిట్‌ నిష్పత్తి క్షీణించిందని సంస్థ డైరెక్టర్‌ నికితా ఆనంద్‌ అన్నారు.

Updated Date - Apr 29 , 2024 | 06:15 AM