Share News

మార్కెట్లోకి బజాజ్‌ పల్సర్‌ ఎన్‌ఎస్ 400

ABN , Publish Date - May 04 , 2024 | 05:47 AM

ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్‌ ఆటో మార్కెట్లోకి సరికొత్త పల్సర్‌ ఎన్‌ఎ్‌స 400జీ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. ఈ బైక్‌ ధర రూ.1.85,000 (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌). శుక్రవారం పుణెలో...

మార్కెట్లోకి బజాజ్‌ పల్సర్‌ ఎన్‌ఎస్ 400

ధర రూ.1.85 లక్షలు

  • ఇప్పటి వరకు 1.8 కోట్ల పల్సర్‌ బైక్స్‌ విక్రయం

  • కంపెనీ ఎండీ రాజీవ్‌ బజాజ్‌

పుణె: ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్‌ ఆటో మార్కెట్లోకి సరికొత్త పల్సర్‌ ఎన్‌ఎ్‌స 400జీ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. ఈ బైక్‌ ధర రూ.1.85,000 (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌). శుక్రవారం పుణెలో జరిగిన కార్యక్రమంలో బజాజ్‌ ఆటో ఎండీ రాజీవ్‌ బజాజ్‌ ఈ బైక్‌ను లాంఛనంగా మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్సర్‌ ఎన్‌ఎ్‌స 400తో స్పోర్ట్స్‌ బైక్‌ విభాగంలో కంపెనీ స్థానం మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు. ఈ కొత్త బైక్‌ను రూ.5,000 చెల్లించి బుక్‌ చేసుకోవచ్చని, అయితే ఈ ఆఫర్‌ పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుందని చెప్పారు. 373 సీసీ ఇంజన్‌, 6 స్పీడ్‌ గేర్‌బాక్స్‌, బ్లూటూత్‌ కనెక్టివిటీతో కలర్‌ ఎల్‌సీడీ స్పీడో మీటర్‌, నాలుగు రకాల రైడ్‌ మోడ్స్‌ ఈ బైక్‌ ప్రత్యేకతలు. కాగా ఇప్పటి వరకు 1.8 కోట్ల పల్సర్‌ బైక్స్‌ను విక్రయించినట్లు రాజీవ్‌ బజాజ్‌ తెలిపారు. స్పోర్ట్స్‌, కమ్యూటర్‌ బైక్స్‌, త్రిచక్ర వాహనాల మార్కెట్లో మరింత పట్టును చేజిక్కించుకునేందుకు ద్విముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. 125 సీసీ బైక్స్‌ విభాగంలో కంపెనీకి ఇప్పటికే 32 శాతం మార్కెట్‌ వాటా ఉందని, దీన్ని మరింతగా పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాజీవ్‌ బజాజ్‌ చెప్పారు.

జూన్‌లో సీఎన్‌జీ మోటార్‌సైకిల్‌: కాగా ఈ ఏడాది జూన్‌ 18న ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్‌ను ఆవిష్కరించనున్నట్లు రాజీవ్‌ బజాజ్‌ వెల్లడించారు. పెట్రోల్‌ ధరలు భారీగా పెరిగిపోయిన పరిస్థితుల్లో వాహనదారులకు ఊరటనిచ్చే ఉద్దేశంతో ఈ బైక్‌ను రూపకల్పన చేసినట్లు తెలిపారు.

పన్నుల మోతతోనే అధిక ధరలు: దేశీయంగా వాహన పరిశ్రమపై ఉన్న అతి నియంత్రణలతోనే వాహన ధరలు గణనీయంగా పెరిగిపోయాయని రాజీవ్‌ బజాజ్‌ వ్యాఖ్యానించారు. బ్రెజిల్‌ వంటి దేశాల్లో మోటార్‌సైకిల్స్‌పై పన్నులు 8-14 శాతం శ్రేణిలో ఉండగా భారత్‌లో మాత్రం జీఎ్‌సటీ ఏకంగా 28 శాతం ఉందని ఆయన తెలిపారు. దీంతో వాహనాల ధరలను తగ్గించే పరిస్థితి ఉండటం లేదన్నారు. ప్రభుత్వం జీఎ్‌సటీని 12-18 శాతానికి తగ్గిస్తే వినియోగదారులతో పాటు ఆటోమొబైల్‌ పరిశ్రమకు మేలు చేకూరుతుందని రాజీవ్‌ అన్నారు.

Updated Date - May 04 , 2024 | 07:42 AM