Share News

ముగిసిన ఉపసంహరణ.. పోరుకు సంసిద్ధం

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:07 AM

సార్వత్రిక ఎన్నికలలో భాగంగా నామి నేషన్ల ఉపసంహరణ సోమవారంతో ముగియడంతో ఇక పోలింగ్‌ సంగ్రామానికి సంసిద్ధమవుతున్నారు.

ముగిసిన ఉపసంహరణ.. పోరుకు సంసిద్ధం
అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు కార్యక్రమంలో పాల్గొన్న అభ్యర్థులు, వారి ప్రతినిధులు

మదనపల్లె ఎన్నికల బరిలో 15 మంది, తంబళ్లపల్లెలో 11 మంది, పీలేరులో 12 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు

మదనపల్లె టౌన, ఏప్రిల్‌ 29: సార్వత్రిక ఎన్నికలలో భాగంగా నామి నేషన్ల ఉపసంహరణ సోమవారంతో ముగియడంతో ఇక పోలింగ్‌ సంగ్రామానికి సంసిద్ధమవుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల బరిలో ఈ సారి 15 మంది అభ్యర్థులు నిలిచారు. మొత్తం 19 మంది నామినేష న్లు దాఖలు చేయగా వివిధ కారణాలతో వారిలో నలుగురు నామి నేషన్లను రిటర్నింగ్‌ అధికారి హరిప్రసాద్‌ తిరస్కరించారు. సోమవా రం నిర్వహించిన ఉపసంహరణ ప్రక్రియలో మిగిలిన 15 మంది అభ్యర్థుల్లో ఎవ్వరు కూడా నామినేషన ఉపసంహరించుకోలేదు. దీం తో ఎన్నికల బరిలో 15 మంది నిలిచారు. వారిలో టీడీపీ అభ్యర్థి షాజహానబాషా, వైసీపీ అభ్యర్థి నిస్సార్‌అహ్మద్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి ఎం.పవనకుమార్‌రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి రాసింటి నరసింహులు, జైభారత నేషనల్‌ పార్టీ అభ్యర్థి ఎం.భాస్కర్‌, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అభ్యర్థి ఎ.కృష్ణప్ప, మిగిలిన వారిలో వి.ఉమాదేవి, బి.నర సింహనాయక్‌, ఎస్‌.జయసింహ, రాయదుర్గం జనార్ధన, షేక్‌ ఆజిద్‌ బాషా, ఎస్‌.షాజహాన, షేక్‌ నిస్సార్‌ అహ్మద్‌, ఎం.గుల్నాజ్‌బేగంలు స్వతంత్య్ర అభ్యర్థులుగా ఎన్నికల బరిలో నిలిచారు.

మదనపల్లెలో ఒకే ఈవీఎంతో ఎన్నికలు

ఎలకా్ట్రనిక్‌ ఓటింగ్‌ మిషన(ఈవీఎం)లో ఒకదానిలో 15 మంది అభ్య ర్థులు, ఒక నోటా బటన కలిపి 16 బటనలు మాత్రమే ఉంటాయి. ఒక వేళ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల సంఖ్య 16 అయితే నోటా బటనకు రెండో ఈవీఎం ఏర్పాటు చేయాల్సి వస్తుంది. అదే జరిగి వుంటే మదనపల్లె నియోజకవర్గంలోని 259 పోలింగ్‌ కేంద్రాలకు అదనంగా 259 ఈవీఎంలు సరఫరా చేయాల్సి వచ్చేది. కాని మద నపల్లె అసెంబ్లీ ఎన్నికల బరిలో 15 మంది మాత్రమే అభ్యర్థులు బరిలో ఉండటంతో నోటాతో కలిపి 16 బటనలు వుండే ఒకే ఈవీ ఎంతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో 22 మంది ఎన్నికల బరిలో ఉండడంతో రెండు ఈవీఎంలను వినియోగించారు.

తంబళ్లపల్లె బరిలో 11 మంది పోటీ

తంబళ్లపల్లె, ఏప్రిల్‌ 30: సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది. తంబళ్లపల్లె శాస నసభ స్థానానికి మొత్తం 19 మంది అభ్యర్థులు 34 సెట్లు నామి నే షన్లును దాఖలు చేశారు. ఇందులో 12 మంది నామినేషన్లను ఎన్నికల అధికారులు ఆమోదించగా...7 మంది నామినేషన్లు తిరస్కర ణకు గురయ్యాయి. ఆమోదం పొందిన 12 మందిలో సోమవారం ఓ స్వతంత్ర అభ్యర్థి ఎంఎస్‌ భానుచంద్రారెడ్డి తన నామినేషనను ఉప సంహరించుకోగా చివరిగా 11 మంది అభ్యర్థులు తంబళ్లపల్లె అసెంబ్లీ ఎన్నికల పోటీలో నిలిచారు. పోటీలో నిలిచిన వారిలో ప్రఽధా న పార్టీలైన టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌తో పాటు పలు పార్టీల అభ్య ర్థులు 6 మంది, స్వతంత్ర అభ్యర్థులు 5 మంది ఉన్నారు. పోటీలో ఉన్న వారికి ఎన్నికల అధికారులు గుర్తులు కేటాయించారు.

పీలేరులో 12 మంది అభ్యర్థులు

పీలేరు, ఏప్రిల్‌ 29: పీలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్లు దాఖలు చేసిన వారెవరూ ఉపసంహరించుకోలేదని ఎన్నికల సహా య రిటర్నింగ్‌ అధికారి మహబూబ్‌ బాషా తెలిపారు. దీంతో ఎన్ని కల బరిలో 12 మంది అభ్యర్థులు ఉన్నారని, ఎన్నికల కమిషన నిబంధనల మేరకు బరిలో మిగిలిన అభ్యర్థులందరికీ గుర్తులు కూడా కేటాయించామన్నారు.

గాజుగ్లాసు గుర్తు కోసం ఇండిపెండెంట్ల పోటీ

మదనపల్లె టౌన, ఏప్రిల్‌ 29: మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల ప్రక్రియలో సోమవారం నామినేషన్ల ఉపసంహరణ కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా బరిలో నిలిచిన అభ్యర్థులకు రిటర్నింగ్‌ అధికారి గుర్తులను కేటాయించారు. ఇందులో భాగంగా ఇండిపెండెంట్‌ అభ్యర్థులు జయసింహ, షాజహానలు తమకు గాజుగ్లాసు గుర్తులు కేటాయించాలని పోటీపడ్డారు. దీంతో రిటర్నింగ్‌ అధికారి హరిప్రసాద్‌ రెండు పేర్లను రెండు చీటిలలో రాసి లాటరీ వేసారు. చివరికి ఇండిపెండెంట్‌ అభ్యర్థి షాజహానను గాజుగ్లాసు గుర్తు దక్కింది. దీంతో జనసేన నాయకులు శ్రీరామ రామాంజ నేయులు, దారం అనితలు ఇండిపెండెంట్‌ అభ్యర్థికి గాజుగ్లాసు గుర్తు కేటాయించడంపై ఎన్నికల అబ్జర్వర్‌ కవిత, ఆర్‌వో హరిప్రసా ద్‌కు ఫిర్యాదు చేశారు.

Updated Date - Apr 30 , 2024 | 12:07 AM