Share News

ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలి

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:46 PM

ఓటు హక్కు అమూ ల్యమైనదని సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఓటరు తప్పకుండా వినియోగించుకోవాలని రిటర్నింగ్‌ అధికారి రాఘవేంద్ర పేర్కొన్నారు.

ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలి
మొక్కను నాటుతున్న ఆర్వో రాఘవేంద్ర

తంబళ్లపల్లె, ఏప్రిల్‌ 28: ఓటు హక్కు అమూ ల్యమైనదని సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఓటరు తప్పకుండా వినియోగించుకోవాలని రిటర్నింగ్‌ అధికారి రాఘవేంద్ర పేర్కొన్నారు. ఓటరు అవ గాహన కార్యక్రమంలో బాగంగా ఆదివారం తం బళ్లపల్లె రిటర్నింగ్‌ అధికారి కార్యాలయ ఆవర ణలో ఎన్నికల అధికారులతో కలసి వోటింగ్‌ మొ క్కను నాటారు. ఈ సందర్భంగా ఆర్వో మాట్లా డు తూ..వృక్షాల ద్వారా ఫలాలు ఏవిధంగా పొందుతారో అదేవిధంగా ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటే వృక్షం అనే ప్రజాస్వామ్య ఫలాలను అందరూ పొందే అవకాశం ఉంటుందన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గంలో 75 శాతం ఓటింగ్‌ నమోదయ్యిందని..ఈ సారి అంతకన్నా ఎక్కువగా ఓటింగ్‌ నమోదు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కార్యక్రమంలో ఏఆర్వో బ్రహ్మయ్య, తహసీల్దార్లు శ్రీదేవి, శ్రీనివాసులు, శ్రీధర్‌, ఈశ్వరమ్మ, స్వీప్‌ నోడల్‌ అధికారి రమేష్‌బాబు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 11:46 PM