Share News

మామిడి రైతుకు ఊరట..

ABN , Publish Date - Apr 15 , 2024 | 11:32 PM

మామిడి కాయల ఎగుమతులు ప్రారంభమయ్యాయి. పచ్చడికి ఉపయోగించే రుమానీ, పులిహోర, తోతాపురి రకం కాయలను రోజుకు 400 టన్నుల దాకా ఇతర రాషా్ట్రలకు ఎగుమతి చేస్తున్నారు. దీంతో ధరలు భారీగా పెరిగాయి.

మామిడి రైతుకు ఊరట..
కోతకు సిద్ధంగా బేనీషాలు

ఆశాజనకంగా ధరలు

రోజుకు 400 టన్నుల కాయల ఎగుమతి

పండ్లకు డిమాండ్‌

రైల్వేకోడూరు, ఏప్రిల్‌ 15: మామిడి కాయల ఎగుమతులు ప్రారంభమయ్యాయి. పచ్చడికి ఉపయోగించే రుమానీ, పులిహోర, తోతాపురి రకం కాయలను రోజుకు 400 టన్నుల దాకా ఇతర రాషా్ట్రలకు ఎగుమతి చేస్తున్నారు. దీంతో ధరలు భారీగా పెరిగాయి.

రైల్వేకోడూరు నియోజకవర్గంలో బేనీషా, నీలం, ఇమాంపసంద్‌, పులిహోరా, తోతాపురి, రుమాని, కాలేపాడు, నూనెపసంద్‌, రసాలు, మాల్గోవా, రెడ్డిపసంద్‌, మల్లికా, ఖాదర్‌ తదితర రకాల మామిడి కా యలను రైతులు పండిస్తున్నారు. వాతావరణ పరిస్థితులు అను కూలంగా లేనందున ఈ ఏడాది 20 శాతం మాత్రమే పంట ఉంది. దీంతో రైతులు, వ్యాపారులు కాయలను యార్డుకు తరలించకుండా నేరుగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. కాగా ప్రస్తుతం పండ్లుగా వినియోగించే బేనీషా టన్ను రూ. 60 నుంచి 70 వేలు, పులిహోర రకం టన్ను రూ. 50 నుంచి 55 వేలు, పచ్చడికి ఉపయోగించే తోతాపురి కాయలు టన్ను రూ. 35 నుంచి 40 వేలు, రుమానీ టన్ను రూ. 30 నుంచి 35 వేలు, పులిహోర టన్ను రూ. 25 నుంచి 28 వేలు పలుకుతున్నాయి. ఇమాం పసందు టన్ను రూ. 180 నుంచి 200 పలుకుతున్నాయి. పచ్చళ్లకు వినియోగించే కాయలు ప్రస్తుతం రాజ్‌కోట్‌, అహ్మదాబాద్‌, కానపూర్‌, బెనారస్‌, జైపూర్‌, రాజస్థాన, ఉదయ్‌పూర్‌, బిల్వాడ తదితర ప్రాంతాలకు ప్రతి రోజు 20 లారీల్లో పంపిస్తున్నారు. ప్రస్తుతం కాయలతోపాటు, పండ్లకూ డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం పచ్చడి కాయల కోతలు ప్రారంభం కాగా, 15 రోజుల్లో పండ్లు కూడా పూర్తి స్థాయిలో కోతకు సిద్ధమయ్యే పరిస్థితి ఉందని రైతులు అంటున్నారు. తోటలను చీడపీడల నివారణకు రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడే పలువురు రైతులు ఈ సారి ఆర్గానిక్‌ మందులు ఎక్కువగా ఉపయోగించారు. తోటలకు సేంద్రియ ఎరువులు వేయడంతో కాయల రంగు, రుచి, వాసన బాగుంటుందని రైతులు చెబుతున్నారు. కాగా, ఎకరా తోటకు ఎరువులు, మందులు, కూలీలు తదితరాలకు రూ. 50 వేలు ఖర్చు చేశామనీ, ధరలు బాగుండడంతో ఈ ఏడాది ఆదాయం బాగా వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మామిడి సీజన లో సుమారు 2 వేల మంది కూలీలకు ఉపాధి కలుగుతుంది. సీజన లో కర్నూలు, అనంతపురం, కడప, రాజంపేట, గుత్తి తదితర ప్రాంతాల నుంచి రైల్వేకోడూరు కు వచ్చి జీవనోపాధి పొందుతారు. సీజన లో కోట్లాది రూపాయల వ్యాపారం సాగుతుంది.

Updated Date - Apr 15 , 2024 | 11:32 PM