Share News

ప్రభుత్వ మద్యం బేజారు..బెల్టు షాపులు జోరు

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:11 AM

గుర్రంకొండ పట్టణంలో మద్యం దుకాణం సాయంత్రం కాగానే మూత పడుతుండడంతో మద్యం ప్రియులు మద్యం కోసం పాట్లు పడుతున్నారు.

ప్రభుత్వ మద్యం బేజారు..బెల్టు షాపులు జోరు

గుర్రంకొండ, ఏప్రిల్‌ 29:గుర్రంకొండ పట్టణంలో మద్యం దుకాణం సాయంత్రం కాగానే మూత పడుతుండడంతో మద్యం ప్రియులు మద్యం కోసం పాట్లు పడుతున్నారు. ప్రభుత్వం మద్యం దుకాణాలను ఉదయం 11 గంటల నుం చి రాత్రి 9 గంటల వరకు తెరచివుంచుతుంది. ఈ నేపథ్యం లో మద్యం ప్రియులు రాత్రి 9 గంటల ోపు మద్యాన్ని తీసుకొనేవారు. అయితే ఎన్నికల కోడ్‌ అమలు కావడంతో మద్యం దుకాణాలకు రోజు వారి లిమిట్‌ను కేటాయించారు. దీంతో గుర్రంకొండ మద్యం దుకాణానికి రోజుకు రూ.3 లక్షల వరకు లిమిట్‌ను కేటాయించారు. ఈ నేపథ్యంలో మద్యం దుకాణాన్ని ఉదయం 11 గంటలకు తెరవక మునుపే మద్యం ప్రియలు దుకాణం వద్ద వేచి ఉంటు న్నారు. దీంతో సాయంత్రం 7 గంటలు కాగానే రోజు వారి టార్గెట్‌ అయిపోతుంది. ఈ క్రమంలో మద్యం దుకాణాన్ని మూసి వేస్తున్నారు. ఇక మద్యం దొరకక మందుబాబులు తలలు పట్టుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే దుకాణం పని చేసే కొందరు బెల్టు షాపు నిర్వాహకులకు ఇష్టానుసారంగా మద్యం బాటిళ్లను ఇస్తు న్నారని పెద్ద ఎత్తున విమ ర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో బెల్టు షాపు నిర్వాహకుల నుంచి మ ద్యం దుకాణంలో పని చేసే వారికి మామూలు ఉన్నట్లు మందుబాబులు ఆరోపిస్తున్నారు. దీంతో బెల్టు షాపు నిర్వాహకులు ఒక్క మద్యం బాటిళ్లపై రూ.20 నుంచి 50 వరకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు చర్చనడుస్తోంది. ఈ విషయమై ఎస్‌ఈబీ ఎస్‌ఐ జయనరసింహా వివరణ కోరగా మద్యాన్ని రోజు వారి లిమిట్‌ మేరకే విక్రయిస్తునట్లు తెలి పారు. మద్యాన్ని బెల్టు షాపులో విక్రయిస్తే వారిపై చర్యలు తీసుకొంటామన్నారు.

Updated Date - Apr 30 , 2024 | 12:11 AM