Share News

వైభవంగా పాలేటి గంగమ్మ తిరుణాల

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:52 PM

కురబలకోట మండల,ం తెట్టు సమీపంలో వెలసిన పాలేటి గంగమ్మ తిరుణా లను అంగరంగ వైభవంగా నిర్వహించారు.

వైభవంగా పాలేటి గంగమ్మ తిరుణాల

కురబలకోట, ఏప్రిల్‌ 28: కురబలకోట మండల,ం తెట్టు సమీపంలో వెలసిన పాలేటి గంగమ్మ తిరుణా లను అంగరంగ వైభవంగా నిర్వహించారు. రెండు రోజుల పాటు నిర్వహించనున్న తిరుణాల ఆదివా రం నుంచి ప్రారంభం కావడంతో చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన భక్తులు తరలివచ్చి అమ్మవా రికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. కాగా తిరుణాలకు వచ్చే భక్త్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ కమిటీ ఛైర్మన ఆంజినేయులు సిబ్బంది ఏర్పాట్లను చేపట్టారు. ఈ సందర్భంగా విద్యుత దీపాలతో అలంకరించిన చాందినీ బండ్లను ఊరేగించారు. అలాగే తంబళ్లపల్లె కూటమి అభ్యర్థి జయచంద్రారెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు సీడ్‌ మల్లికార్జున నాయుడు, రాజంపేట పార్లమెంటరీ బీసీ సెల్‌ అధ్యక్షుడు సురేంద్రయాదవ్‌, మండల కన్వీనర్‌ వైజీ సురేంద్ర, పార్లమెంటరీ తెలుగు యువత ప్రధానకార్యదర్శి అయూబ్‌బాషా పాల్గొన్నారు.

కమనీయం.. సీతారాముల కల్యాణం

కలకడ, ఏప్రిల్‌ 28:మండలంలోని మర్రి మానుపల్లె రామాలయంలో సీతారాము ల కల్యాణాన్ని అర్చకులు కమనీయంగా వైభవం గా నిర్వహించారు. ఈ సందర్భం గా స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి మంగ ళవాయిద్యాలు, బళ్లారి డ్రమ్ముల మధ్య ఉత్స వ మూర్తులను ఊరేగించారు. భక్తులు కొబ్బరి కాయలు సమర్పించి మొక్కులు తీర్చుకు న్నారు. అలాగే అన్నదానాలు చేసి తీర్థప్రసాదాలను అందజేశారు.

సంతానలక్ష్మికి ప్రత్యేక పూజలు

గుర్రంకొండ, ఏప్రిల్‌ 28:గుర్రంకొండ మండలం చెర్లోపల్లెలో కొలువైన రెడ్డెమ్మకొండ ఆలయంలో ఆదివారం అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయంలో అమ్మవారు సంతాన లక్ష్మీగా ప్రసిద్ధి చెందారు. అనంతరం అమ్మవారిని పరిమళభరిత పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి పూజలను చేశారు. అమ్మవారిని దర్శించుకో వడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చారు. అమ్మవారి కృపతో సంతానం పొందిన మహిళలు మొక్కులు తీర్చుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.

Updated Date - Apr 28 , 2024 | 11:52 PM