Share News

మాజీ సీఎం, కూటమి ఎంపీ అభ్యర్థి కిరణ్‌ పర్యటన

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:13 AM

బి.కొత్త కోట నగర పంచాయతీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని టీడీ పీ, జనసేన, బీజేపీ నాయకు లు కోరారు.

మాజీ సీఎం, కూటమి ఎంపీ అభ్యర్థి  కిరణ్‌ పర్యటన
మైనారిటీ ఫంక్షనహాల్లో సమావేశమై చర్చిస్తున్న మైనారిటీ నాయకులు

బి.కొత్తకోట, ఏప్రిల్‌29: బి.కొత్త కోట నగర పంచాయతీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని టీడీ పీ, జనసేన, బీజేపీ నాయకు లు కోరారు. ఈ సందర్బంగా బి.కొత్తకోటలో విలేకర్లతో వారు మాట్లాడుతూ మం గళవారం (ఈనెల 30న) కిరణ్‌కుమార్‌రెడ్డి సాయంత్రం 3.00కు బెంగళూరు రోడ్డులోని షాదీమహల్‌లో మైనారిటీ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహి స్తారన్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గ కూటమి అభ్యర్థి జయచంద్రారెడ్డి సైతం పాల్గొనే ఈ సమావేశంలో, బి.కొత్తకోట మండలంలోనే కాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా వున్న ముస్లిం మైనారిటీలు పెద్దసంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజ యవంతం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పర్వీనతాజ్‌, శ్రీనివాసులు, బంగారు వెంకట్రమణ, గోరంట్ల రమేష్‌, రామదాసు, కావడి రవీంద్ర, ఫాజిల్‌, రాజాచాకనా, శివ, సురేంద్ర, ఇమాంసాబ్‌ తదితరులు పాల్గొన్నారు.

పెద్దతిప్పసముద్రంలో: పీటీఎం మండలంలోని టి.సదుం పంచాయతీ లోని చెన్నరాయునిపల్లెకు రాజంపేట పార్లమెంట్‌ కూటమి ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి మంగళవారం పర్యటిస్తున్నట్లు ములకలచెరువు మాజీ మార్కె ట్‌ కమిటీ చైర్మెన శ్రీనాథ్‌రెడ్డి తెలిపారు. ఈసందర్బంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ తంబళ్లపల్లె నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి దాసరిపల్లె జయచంద్రారెడ్డి గెలుపు కోసం ఆయన ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పీటీఎం మండలానికి విచ్చేసి టి.సదుం గ్రామం లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తారన్నారు. చెన్నరాయునిపల్లె క్రాస్‌లోని చౌడేశ్వరీ కళ్యాణ మండపంలో నిర్వహించే సమావేశంలో పాల్గొని కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మండలంలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సమావేవాన్ని విజయ వంతం చేయాలని ఆయన కోరారు.

Updated Date - Apr 30 , 2024 | 12:13 AM