Share News

కోళ్లబైలులో తాగునీటి ఎద్దడి

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:44 PM

మదనపల్లె మండలం కోళ్లబైలు-1 పంచాయతీలో తాగునీటి సమస్య ప్రజలను పట్టిపీడిస్తోంది.

కోళ్లబైలులో తాగునీటి ఎద్దడి
అమ్మచెరువుమిట్ట కాలనిలో తాగునీటి కోసం నిరసన తెలుపుతున్న కాలనీ వాసులు

ఖాళీ బిందెలతో నిరసన తెలిపిన మహిళలు, గ్రామస్థులు పేదల సమస్యలు పట్టవా? అంటూ మండిపడుతున్న జనం

మదనపల్లె టౌన/అర్బన, ఏప్రిల్‌ 28: మదనపల్లె మండలం కోళ్లబైలు-1 పంచాయతీలో తాగునీటి సమస్య ప్రజలను పట్టిపీడిస్తోంది. అసలే వేస వి కాలం కావడంతో బిందెడు నీటి కోసం ప్రజల పాట్లు అన్నీ ఇన్నీ కావు. దీంతో సమస్యను వెంటనే పరిస్కరించాలంటూ స్థానిక మహిళ లు, గ్రామస్థులు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఆదివారం కోళ్లబై లు పంచాయతీ పరిధిలోని అమ్మ చెరువుమిట్ట కాలనీకి చెందిన ప్రజలు ఖాళీ బిందెలు చూపుతూ రోడ్డుపై ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మ చెరువుమిట్ట, వైఎస్సార్‌ కాలనీలో 600 కుటుంబాలు నివశిస్తున్నాయని కాని ఇక్కడ తాగునీటి సరఫరా సక్ర మంగా చేయడం లేదన్నారు. దీంతో నిత్యం ప్రైవేటు ట్యాంకర్ల వద్ద బిం దె రూ.2 పెట్టి నీరు కొనుక్కోవాల్సి వస్తోందని వాపోయారు. కోళ్లబైలు కాలనీ, ఇందిరమ్మకాలనీ, జగనకాలనీ, చంద్రకాలనీ, కనకదాస్‌నగర్‌, వైఎస్సార్‌ కాలనీల్లో నీటిఎద్దడ తీవ్రంగా ఉందని నాలుగైదు నెలలుగా సచివాలయం, ఎంపీడీవో, మున్సిపాలిటీ, సబ్‌కలెక్టర్‌ కార్యాలయాల చుట్టూ తిరిగి అడుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని మండిప డుతున్నారు. ఈ కాలనీలో రోజువారి కూలీలు, నిరుపేదలు ఎక్కువగా ఉండడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతూనే తాగునీరు కొనుగోలు చేయా ల్సి వస్తోందన్నారు. సీపీఐ రాష్ట్రసమితి సభ్యుడు కృష్ణప్ప, ఏపీ వ్యవ సాయ కార్మిక సంఘం నియోజక వర్గ కార్యదర్శి చంద్రశేఖర్‌ మా ట్లాడుతూ 2007లో ఇందిరమ్మ కాలనీ అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఇక్కడ కనీస సౌకర్యాలు లేవన్నారు. ఇప్పటికైనా అధికారులు సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక కాలనీవా సులు షబానా, షకీలా, రెడ్డెప్పరెడ్డి, హరి, మల్లమ్మ, శారదమ్మ, గంగుల మ్మ, సూరి, గంగిరెడ్డి, శేఖర్‌, రమణయ్య, పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 11:44 PM