Share News

ప్రజా సమస్యలు పట్టించుకోరా?

ABN , Publish Date - Apr 15 , 2024 | 11:38 PM

రజా సమస్యలపై వినతులు స్వీకరించని ప్రొద్దుటూరు తహసీల్దారు విద్యాసాగర్‌ వ్యవహార శైలిపై ప్రజా సంఘాలు తీవ్ర అభ్యంతాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం తహసీల్దారు చాంబర్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి చాంబర్‌ అని, ఇందులోకి ఎవరినీ అనుమతిం చమని, ఆర్‌వో కార్యాలయానికి 100 మీటర్ల దూరం వరకు ఎవరినీ అను మతించమని చెబుతున్నారు.

ప్రజా సమస్యలు పట్టించుకోరా?
తహసీల్దారు కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్న అటెండర్‌

అర్జీలు స్వీకరించని తహసీల్దారు

ప్రజా సంఘాల ఆగ్రహం

ప్రొద్దుటూరు, ఏప్రిల్‌ 15: ప్రజా సమస్యలపై వినతులు స్వీకరించని ప్రొద్దుటూరు తహసీల్దారు విద్యాసాగర్‌ వ్యవహార శైలిపై ప్రజా సంఘాలు తీవ్ర అభ్యంతాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం తహసీల్దారు చాంబర్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి చాంబర్‌ అని, ఇందులోకి ఎవరినీ అనుమతిం చమని, ఆర్‌వో కార్యాలయానికి 100 మీటర్ల దూరం వరకు ఎవరినీ అను మతించమని చెబుతున్నారు. దీంతో ప్రజాసంఘాల నేతలు సోమవారం తహసీల్దారు విద్యాసాగర్‌తో వాదనకు దిగారు. బీసీ బాలిక హాస్టల్‌ భవ నం కూలడానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోకపోగా, ఆ విద్యార్థినుల సంక్షేమాన్ని పట్టించుకోకపోవడంపై తహసీల్దారుకు వినతి పత్రం సమర్పించేందుకు తహసీల్దారు కార్యాలయం వద్దకు వచ్చిన ప్రజా సంఘాలు, మహిళా సంఘాల నేతలను లోపలికి వెళ్ళడానికి అటెండర్‌ అ డ్డుకున్నా. ఎలాగోలా లోనికి వెళ్లిన వారు సమస్య వివరిస్తుండగా, కలెక్టరు కు తామే నివేదిక పంపామని చెబుతూనే, ఇది ఆర్‌వో చాంబర్‌ అని ఇక్కడికి అందరు రాకూడదని గదమాయించారు. అనంతరం, తమకు రామే శ్వరం జగనన్న కాలనీల్లో పట్టా ఇచ్చారని, కానీ నేటికి అది ఎక్కడవుందో చూపించలేదని, . తమతో 35 వేలు డబ్బుు కట్టించుకున్నారని, 20 వేలు లోనకూడా తీసుకున్నారని కానీ, ఇంటినిర్మాణం గురించి చెప్పడంలేదంటూ ఫిర్యాదు చేసేందుకు ఓ వృద్ధ జంట కార్యాలయానికి వచ్చింది. వారిని కూడా అటెండర్‌ అడ్డుకున్నాడు. అక్కడే ఉన్న సీపీఐ నాయకులు రామయ్య, సుబ్బరాయుడు కాంగ్రెస్‌ నాయకుడు నజీర్‌లు వారిని విచారించారు. ఎందుకు లోపలికి అనుమతించరంటూ అటెండర్‌తో వాదించారు. అనం తరం వారు తహసీల్దారు విద్యాసాగర్‌ను కలిసి పరిస్థితి వివరించగా, ఇది ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంగా మారిందని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బయట హెల్ప్‌డెస్కు పెట్టామని అక్కడ సంప్రదించాలని తహసీల్దారు తెలిపారు. దీంతో ప్రజల సమస్యలు తహసీల్దారు స్వీకరించవద్దని ఎన్నికల కమిషన్‌ తెలిపిందా అని నాయకులు వాదించడంతో, పార్టీ ప్రతినిధులుగా ఉన్న మీకు ఆ మాత్రం తెలియదా అనడంతోపాటు, ఈ అంశాలపై ప్రత్యేకంగా సెల్‌ ఏర్పాటు చేస్తామని తహసీల్దారు సమాధానమిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కోసం తహసీల్దారు కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటుచేయాలని, లేకుంటే జిల్లా కలెక్టర్‌కు, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు.

Updated Date - Apr 15 , 2024 | 11:38 PM