Share News

క్లాప్‌ ఫ్లాప్‌

ABN , Publish Date - Apr 14 , 2024 | 11:25 PM

ఇంటింటా చెత్త సేక రణ కార్యక్రమం ఆర్భాటంగా చేపట్టినా అమలు మాత్రం విఫలమైందని చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన క్లీన్‌ ఆంధ్ర ప్రదేశ్‌ (క్లాప్‌) అమలులో మాత్రం చతికల పడిందని చెప్పవచ్చు.

క్లాప్‌ ఫ్లాప్‌

తిరగని క్లాప్‌ ఆటోలు

నిలిచిపోయిన ఇంటింటి చెత్త సేకరణ

నిర్వహణపై చేతులెత్తేసిన ప్రభుత్వం

వీధి వీధినా దర్శనమిస్తున్న చెత్త దిబ్బలు

మందకొడిగా చెత్త పన్ను వసూళ్లు

శానిటేషన్‌ అధికారుల వైఫల్యం

ప్రొద్దుటూరు, ఏప్రిల్‌ 14: ఇంటింటా చెత్త సేక రణ కార్యక్రమం ఆర్భాటంగా చేపట్టినా అమలు మాత్రం విఫలమైందని చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన క్లీన్‌ ఆంధ్ర ప్రదేశ్‌ (క్లాప్‌) అమలులో మాత్రం చతికల పడిందని చెప్పవచ్చు. రాష్ట్రంలో అన్ని కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో ఇంటింటి నుంచి చెత్తసేకరణ కోసం వాహనాలనుఏర్పాటు చేసి నిర్వహణ బాధ్యత ప్రైవేటు ఏజన్సీల కు అప్పగించింది. కానీ అనుకున్నంత స్థాయిలో చెత్త పన్ను వసూలు కావడంలేదు. దీంతో క్లాప్‌ వా హనాల ఏజన్సీకి మున్సిపాలిటీలు అద్దెలు చెల్లించ లేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా క్లాప్‌ వాహనాల మెయింటెనెన్స్‌, మరమ్మత్తులకు, సిబ్బందికి జీతాలు చెల్లించడం భారమైంది. మున్సిపల్‌ శానిటేషన్‌ అధి కారుల వైఫల్యంతో సకాలంలో చెత్త తరలింపు పను లు చేపట్టలేక పోవడంతో వీధి వీధిన చెత్త దిబ్బలు దర్శనమిస్తున్నాయి. దీంతో రోడ్లన్నీ దుర్వాసనతో కంపు కొడుతున్నాయి. వివరనాల్లోకెళితే...

జిల్లాలో కడప ప్రొద్దుటూరు మున్సిపాలిటీల్లో 2022 మార్చి1 నుంచి క్లాప్‌ వాహనాలు ప్రారంభిం చి ఇంటింటా చెత్తసేకరణ పనులు ప్రారంభించారు. కడపలో 100 వాహనాలు, ప్రొద్దుటూరు మున్సి పాలిటీ పరిధిలో 40 వాహనాలు అవసరం వుండ గా 35 వాహనాలు అందుబాటులో వుంచారు. కడ పలో 100 వాహనాలకు నెలకు రూ. 56,81,678 ప్రొద్దుటూరులో 35 వాహనాలకు నెలకు రూ. 24,35,004 మున్సిపాలిటీ ఏజెన్సీకి చెల్లిస్తోంది. ఈ ప్రకారం ఒక్కో వాహనానికి నెలకు రూ.64 వేల అద్దె చెల్లిస్తున్నారు. ఈ అద్దె మున్సిపాలిటీల్లో యూజర్‌ చార్జీల పేర చెత్తపన్ను వసూలు చేసి చెల్లించాల్సివుంది. అయితే ప్రజల్లో చెత్త పన్ను పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండడంతో అనుకు న్నంత స్ధాయిలో వసూళ్లు కావడంలేదు. ప్రత్యేకం గా వార్డుకు ఒక సచివాలయ శానిటరీ సెక్రటరీ వున్నా యూజర్‌ చార్జీల వసూళ్లలో వెనకబడ్డారు. దీంతో ఏజెన్సీలకు సకాలంలో మున్సిపాలిటీలు అద్దె చెల్లించకపోవడంతో ఏజెన్సీలు డ్రైవర్లుకు జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఏజన్సీలు క్లాప్‌ వాహనాల డ్రైవర్లుకు సూపర్‌ వైజర్లుకు జీతాలు చెల్లించలేక మరమ్మత్తులు సైతం చేపట్టలేక ఆటో లు నిలిచిపోయాయి. నెలల తరబడి జీతాలు చెల్లిం చకపోవడంతో క్లాప్‌ సిబ్బంది విధులు నిర్వహించ బోమని ఫిబ్రవరి నుంచి ఆటోలు తిప్పడం బంద్‌ చేశారు. దీంతో కసువు సేకరణ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. కడప ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ల్లో క్లాప్‌ ఆటోలు కొన్నింటిని తిప్పుతూ డ్రైవర్లుకు జీతాలు ఇచ్చేలా డీజల్‌ ఖర్చు భరించేలా అధి కారులు చర్యలు తీసు కుంటున్నారు.

చేతులెత్తేసిన ఏజన్సీ

మున్సిపాలిటీలు అద్దె సకాలంలో చెల్లించ లేకపోవడంతో ప్రొద్దుటూరులో క్లాప్‌ వాహనాల సేవలను రెడ్డి ఏజన్సీ బంద్‌ చేసి చేతులెత్తేసింది. దీంతో వాహనాలన్నీ మున్సి పాలిటీలో ఎక్కడికక్కడ నిలిపివేశారు. చాలా రో జులుగా మూలన ప డడంతో టైర్లు పాడైపోయాయి. వాహనాల పైన వుండే చెత్త డోర్లు తీసుకెళ్లారు. మరికొన్ని తుప్పు పట్టే పరిస్దితి ఏర్పడింది.

మున్సిపాలిటీలకు భారం....

36 క్లాప్‌ వాహనాల్లో 18 వరకు పూర్తిగా బాగా దెబ్బతిన్నాయి. కేవలం 18 ఆటోలు మాత్రమే కొంత మరమ్మత్తులు చేయించి మున్సిపల్‌ అధికారులు వాటితో సేవలు పునరుద్దరించే పనులు చేపట్టారు. ఏజన్సీతో సంబంధం లేకుండా కేవలం క్లాప్‌ డైవర్ల కు జీతాలు నేరుగా చెల్లించేందుకు, డీజల్‌ ఖర్చు లు భరించేందుకు కౌన్సిల్‌ తీర్మానం తీసుకున్నారు.

వీధుల్లో చెత్త దిబ్బల కంపు

పట్టణంలో మళ్లీ చెత్త దిబ్బలు దర్శనమిస్తున్నా యి. రోజుల తరబడి చెత్త తరలింపులో జాప్యం జరుగుతుండడంతో కుళ్లి కంపుకొడుతున్నాయి. కేవ లం 18 క్లాప్‌ ఆటోలు మాత్రమే తిరుగుతున్నా యి. చాలా వార్డుల్లో పుష్‌కాట్‌తో సేకరించిన చెత్త నేరుగా డంపింగ్‌ యార్డుకు వెళ్లకుండా రోడ్లపై చెత్త పాయింట్లవద్ద సిబ్బంది వేస్తున్నారు. ఈ చెత్త దిబ్బలు సకాలంలో తరలించడంలో జాప్యం జరుగు తుండడంతో వాటిని పందులు అపరిశుభ్రం చేస్తున్నాయి.

18 క్లాప్‌ వాహనాలు, 10 ట్రాక్టర్లు, మూడు పెద్ద కంపాక్టర్లు, మూడుచిన్న కంపాక్టర్లతో చెత్తను డం పింగ్‌ యార్డుకు తరలించే పనుల్లో శానిటేషన్‌ అధి కారుల మధ్య సమన్వయ లోపం తలెత్తింది. దీం తో పట్టణంలో పారిశుధ్య సేవల్లో విపలం అవుతోం దనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీన్ని మున్సిప ల్‌ ఉన్నతాధికారులు సైతం అంగీకరిస్తున్నారు.

వినియోగంలో సగం పుష్‌కాట్‌లు

మున్సిపాలిటీలో 41 వార్డులు వుంటే క్లాప్‌ వాహ నాలు అందులో సగం వార్డులకు కూడా సేవలు అందడం లేదు. దీనికి తోడు కమర్షియల్‌ వ్యర్థాల సేకరణకు ప్రత్యేకించి వాహనాలు లేవు. ఇందువల్ల చాలా వార్డులో ఇంటింటి చెత్త సేకరణకు పుష్‌కాట్‌లు తీసుకెళ్లి సేకరించాలన్నా పుష్‌కాట్‌లలో 180 వుంటే అందులో కేవలం 90 మాత్రమే పనిచే స్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. దీంతో చాలా వార్డుల్లో చెత్త సేకరణ సక్రమంగా సాగడం లేదు.

పారిశుధ్య సేవలు మెరుగు పరుస్తాం

ప్రొద్దుటూరులో పారిశుధ్య సేవల్లో జాప్యం జరుగుతున్న మాట వాస్తవం. గతంలో ఒక ఏడాది పైగా క్లాప్‌ ఆటోలతో నేరుగా ఇంటింటి నుం చి సేకరించిన చెత్త డంపింగ్‌ యార్డుకు వెళ్లేది. క్లాప్‌ ఆటోలు నడపడంలో ఏజన్సీ చేతులేత్తేసింది. ఏజన్సీతో సంబంధం లేకుండా మున్సిపాలిటీనే నేరుగా క్లాప్‌ ఆటో డైవర్లుకు జీతాలు చెల్లించేలా కౌన్సిల్‌ తీర్మా నం తీసుకున్నాం. డీజల్‌ ఖర్చులు మున్సిపాలిటీనే భరిస్తోంది. అందువల్ల 18 ఆటోలను తిప్పుతున్నాం. ఇవి సగం వార్డులకే సేవలు అందించగలవు. కంపా క్టర్లు ట్రాక్టర్ల ద్వారా చెత్తపాయింట్ల వద్ద నుంచి సకాలంలో తరలింపు జరగడం లేదు. శానిటేషన్‌ అధికారుల మధ్య సమన్వయ లోపం, వర్కర్లపై నియంత్రణ లేదు. వారం పది రోజుల్లో పారిశుధ్య సేవలు పూర్తి స్థాయిలో మెరుగు పరుస్తాం.

రఘునాధరెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌, ప్రొద్దుటూరు.

Updated Date - Apr 14 , 2024 | 11:25 PM