Share News

బీసీ వెల్ఫేర్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Apr 15 , 2024 | 11:40 PM

పాడుబడిన భవనాల్లో వసతి గృహాలు నిర్వహిస్తూ బీసీ బాలికల ప్రాణాలతో చెలగాటమాడిన బీసీ వెల్పేర్‌ అధి కారులపై చర్యలు తీసుకోవాలని లేకుంటే ఆందోళన చేస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కృష్ణయ్య, నియోజకవర్గ అధ్యక్షుడు పాణ్యం సుబ్బరాయుడు, చైతన్య మహిళా సంఘం కన్వీనర్‌ పద్మ, విద్యార్థి శక్తి కన్వీనర్‌ హరిత, మహిళా శక్తి కన్వీనర్‌ వడ్ల లక్ష్మీదేవి హెచ్చరించారు.

బీసీ వెల్ఫేర్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలి
తహసీల్దారుకు వినతిపత్రం ఇస్తున్న బీసీ, మహిళా సంఘాల ప్రతినిధులు

తహసీల్దారుకు మహిళా, బీసీ, విద్యార్థి సంఘాల వినతి

ప్రొద్దుటూరు, ఏప్రిల్‌ 15 : పాడుబడిన భవనాల్లో వసతి గృహాలు నిర్వహిస్తూ బీసీ బాలికల ప్రాణాలతో చెలగాటమాడిన బీసీ వెల్పేర్‌ అధి కారులపై చర్యలు తీసుకోవాలని లేకుంటే ఆందోళన చేస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కృష్ణయ్య, నియోజకవర్గ అధ్యక్షుడు పాణ్యం సుబ్బరాయుడు, చైతన్య మహిళా సంఘం కన్వీనర్‌ పద్మ, విద్యార్థి శక్తి కన్వీనర్‌ హరిత, మహిళా శక్తి కన్వీనర్‌ వడ్ల లక్ష్మీదేవి హెచ్చరించారు. బీసీ వేల్పేర్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం తహసీల్దారు కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. అనంతరం తహసీల్దా రు విద్యాసాగర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ పాడుబడిన ఫ్రైవేటు బిల్డింగ్‌లో దశాబ్దకాలంగా బీసీ బాలికల వసతి గృహం నిర్వహిస్తుండడం ప్రభుత్వం వివక్ష పాటించడమేనన్నారు. నాడు నేడులో భాగంగా జగన్‌ ప్రభుత్వం బీసీ బాలికల హాస్టల్‌ భవనాలు ఎందుకు నిర్మించలేదన్నారు. కార్యక్రమంలో మహిళా సంఘం సభ్యురాలు జింకా భాగ్యమ్మ, బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు మాడిశెట్టి ప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2024 | 11:40 PM