Share News

పోలింగ్‌ సమయంలో బీఎల్‌వోలు అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:15 AM

ఎన్నికల సమయంలో బీఎల్‌వోలు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల అబ్జర్వర్‌ కవిత, రిటర్నింగ్‌ అధికారి హరిప్రసాద్‌ పేర్కొన్నారు.

పోలింగ్‌ సమయంలో బీఎల్‌వోలు అప్రమత్తంగా ఉండాలి

మదనపల్లె టౌన, ఏప్రిల్‌ 29: ఎన్నికల సమయంలో బీఎల్‌వోలు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల అబ్జర్వర్‌ కవిత, రిటర్నింగ్‌ అధికారి హరిప్రసాద్‌ పేర్కొన్నారు. సోమవారం స్థానిక సబ్‌కలెక్టరేట్‌లో బూత లెవల్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల బరిలో వున్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించామన్నారు. బీఎల్‌వోలతో మాట్లాడుతూ ఓటర్‌ సమాచారం స్లిప్పులు, ఫొటోలు లేకుం డా స్లిప్పులు ప్రింట్‌ అవుట్‌ తీసి ఇంటింటికి వెళ్లి ఓటర్లకే పంపిణీ చేయాలని సూచించారు. ఏ రాజకీయ నాయకులకు ఈ స్లిప్పులు ఇవ్వరాదన్నారు. అలాగే పోస్టల్‌ బ్యాలెట్‌, పోలింగ్‌ స్టేషనల వద్ద రాజకీయ పార్టీ నాయకుల చిత్రాలు ఉండకూడదని, ఎవరైనా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్లు ఆధారాలతో తెలిస్తే సస్పెన్షనకు గురవుతారని హెచ్చరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం కనిపిస్తే వాటిపై పేపర్లు అతికించి కనిపించకుండా చేయాలన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు సహకరించాలని సూచించారు.

Updated Date - Apr 30 , 2024 | 12:15 AM