Share News

రామయ్య కల్యాణోత్సవానికి ఏర్పాట్లు

ABN , Publish Date - Apr 15 , 2024 | 11:55 PM

వాల్మీకిపురం పట్టాభిరామాడి బ్రహ్మోత్స వాలలో భాగంగా సీతారాముల కల్యాణోత్సవ వేడుకలకు టీటీడీ ఆధ్వర్యంలో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.

రామయ్య కల్యాణోత్సవానికి ఏర్పాట్లు
వాల్మీకిపురంలో కల్యాణోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్న దృశ్యం

వాల్మీకిపురం, ఏప్రిల్‌ 15: వాల్మీకిపురం పట్టాభిరామాడి బ్రహ్మోత్స వాలలో భాగంగా సీతారాముల కల్యాణోత్సవ వేడుకలకు టీటీడీ ఆధ్వర్యంలో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఏడాది స్థానిక బైపాస్‌ రోడ్డులోని టీటీడీ స్థలాలలో భారీ ఏర్పాట్లతో కల్యాణ వేడు కలను అంగరంగ వైభవంగా జరుపుతుంటారు. అయితే అక్కడ ప్రతిఏడులాగే ఏసారి కూడా తాత్కాలిక కల్యాణ వేదిక ఏర్పాటు చేసి సీతారాముల కళ్యాణోత్సవ వేడుకలను నిర్వహిస్తుండడంతో భక్తులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో కల్యాణ వేదిక ఒకటి నిర్మించి ఉంటే ప్రతిఏటా తాత్కాలిక ఏర్పాటు అవసరం లేకుండా ఉంటుందని భక్తులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా సీతారాముల కల్యాణానికి ఓ ప్రత్యేకత ఉందనే చెప్పాలి. ప్రతి ఏటా శ్రీరామనవమి పండుగ మరుసటి రోజు వాల్మీకిపురంలో అమ్మవారి జన్మదిన నక్షత్రం నందు కల్యాణ వేడుకలను జరుపుతుండడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసంవత్సరం అదే శ్రీరామ నవ మి పండుగ రోజున కల్యాణోత్సవం కూడా రావడం స్థానికులు భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 1929వ సంవత్సరం లో ఓ పర్యాయం, తిరిగి 1975లో ఓ సారి శ్రీరామనవమి పండుగ రోజున వాల్మీకిపురంలో సీతారాముల కల్యాణోత్సవ వేడుకలు జరిగినట్లుగా పెద్దల నానుడి. మళ్లీ ఇన్నాళ్లకు అదే శ్రీరామ నవమికి సీతారాముల కల్యాణం జరుగుతుండటంతో భక్తుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

టీటీడీ స్థలాలకు దిక్కు లేకుండాపోతోంది..

వాల్మీకిపురం పట్టణంలోని బైపాస్‌ రోడ్డులో గల టీటీడీ స్థలాలకు దిక్కులేకుండా పోతోందని సర్వత్రా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరానికి ఓ పర్యాయం సీతారాముల కల్యాణోత్సవ వేడుకలకు తాత్కాలిక కల్యాణ వేదిక సిద్దం చేయడం తరువాత వాటిని పట్టించుకోకపోవడంతో ఆ స్థలాలు నిరుపయోగంగా మారుతున్నా యని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా టీటీడీ అధికారులు కల్యాణ వేడుకల అనంతరం టీటీడీ స్థలాలను పరిరక్షించే దిశగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Apr 15 , 2024 | 11:55 PM