Share News

చెరువులో పడి విద్యార్థిని ఆత్మహత్య

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:50 PM

చెరువులో పడి విద్యార్ధిని ఆత్మహత్య చేసుకు న్న విషాదకర సంఘటన ఆదివా రం మండలంలో జరిగింది.

చెరువులో పడి విద్యార్థిని ఆత్మహత్య

కురబలకోట, ఏప్రిల్‌ 28: చెరువులో పడి విద్యార్ధిని ఆత్మహత్య చేసుకు న్న విషాదకర సంఘటన ఆదివా రం మండలంలో జరిగింది. దీనికి సం బంధించి పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పెద్ద మండ్యం మండలం పాపేపల్లె పం చాయతీ గుడిసివారిపల్లె గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి, వరలక్ష్మి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా వారి కుమార్తె రుచిత(18) అంగళ్లులోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. దీంతో విద్యార్థిని చదువు కోసం వారు అంగళ్లకు వచ్చి స్థిరప డ్డారు. కాగా రెండు రోజుల కళాశాలలో జరిగిన కార్యక్ర మానికి హాజరై విద్యార్థిని ఆలస్యంగా ఇంటికి వచ్చిందన కుటుంబీకులు మందలించడంతో రాత్రి సమయంలో ఎవ్వరికీ చెప్పకుండా రామక్క వద్దకు వెళ్ళి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. కాగా విద్యార్థిని తండ్రి తన కుమార్తె కనిపించలేదని శనివారం రాత్రి పోలీసుల కు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. కాగా స్థాని కులు ఆదివారం చెరువులో మృతదేహాన్ని చూసి పోలీ సులకు సమాచారం ఇవ్వగా అక్కడే ఉన్న వారు మృతదే హాన్ని వెలికితీశారు. స్థానిక ముదివేడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వాపత్రికి తర లించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమ కుమార్తె మృతిచెందడంతో కుటుంభీకులు బోరున విలపించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

పిచ్చికుక్క వీరంగం..

పలువురికి తీవ్రగాయాలు

నిమ్మనపల్లి, ఏప్రిల్‌ 28: పిచ్చికుక్చ వీరంగం సృష్టించి మనుషులతో పాటు పాడిఆవులపై కూడా దాడి చేయ డంతో అనేక మంది ఆసుపత్రి పాలైన సంఘటన ఆది వారం మండంలో చోటు చేసుకొంది. గ్రామస్థుల కథనం మేరకు గుడ్రెడ్డిగారిపల్లి, యర్రప్పగారిపల్లి, కొండయ్యగారి పల్లిలో ఓ పిచ్చికుక్క విచక్షణా రహితంగా కనిపించిన వారందని కరవడంతో గ్రామస్థులు భయాందోలకు గుర య్యారు. అంతే కాకుండా పాడిఆవులను సైతం కరవడం తో రైతులు పరుగు తీశారు అనంతరం గాయపడి వారి ని ఆసుప్రతి తరలించగా ఎక్కువగా గాయపడిన వారి తిరుపతి రుయాకు తరటించినట్లు తెలిపారు. గాయపడి వారిలో శంకర, వెంకటరమణరెడ్డి, రాధాకృష్ణ, అంజలితో పాటు పలువురు వున్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

మదనపల్లె టౌన, ఏప్రిల్‌ 28: ద్విచక్రవాహనంలో వెళు తున్న వ్యక్తిని కారు ఢీ కొనడంతో మృతి చెందాడు. కదిరి మండలం చామలగొంది గ్రామానికి చెందిన నారాయ ణప్ప(48) అనే వ్యక్తి మదనపల్లె మండలం వేంపల్లె క్రాస్‌ వద్ద చిన్న హోటల్‌ పెట్టుకుని జీవనం సాగిస్తున్నా డు. ఈ క్రమంలో ఆదివారం హోటల్‌కు కావాల్సిన సరు కులు తీసుకుని ద్విచక్రవాహనంలో వేంపల్లె క్రాస్‌కు వెళుతుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నుంచి ఎగిరి పక్కనే వున్న కాలువలో పడిపోయిన నారాయణప్ప రెండు కాళ్లు పక్కటెముకలు విరిగిపోయాయి. తీవ్రంగా గాయపడిన అతడిని మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించగా, పరి స్థితి విషమించడంతో తిరుపతికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో అతను మృతి చెందాడు. కాగా రోడ్డు ప్రమా దానికి కారణమైన కారు డ్రైవర్‌ పారిపోయాడు. మదనపల్లె తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు.

మామిడి చెట్లు దగ్ధం

గుర్రంకొండ, ఏప్రిల్‌ 28:మండలంలోని తరిగొండకు చెందిన రైతు జయచంద్రారెడ్డికి చెందిన వంద మామిడి, అల్లనేరుడు చెట్లు ఆగ్నికి ఆహుతయ్యాయి. రైతు పొలం చుట్టూ ఉన్న కంచెకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పం టించారు. దీంతో మంటలు చెలరేగి మామిడితోటలోకి ప్రవేశించడంతో సుమారు వంద వరకు మామిడి, అల్లనే రుడు చెట్లు కాలిపోయినట్లు బాధిత రైతు వాపోయాడు. ప్రభుత్వం తగిన సాయం అందజేసి తనను ఆదుకోవాల ని రైతు కోరుతున్నాడు.

Updated Date - Apr 28 , 2024 | 11:50 PM