Share News

1909లోనే భారతీయులకు ఓటు హక్కు

ABN , Publish Date - Apr 29 , 2024 | 11:56 PM

దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటీ్‌షవారిపై భారతీయులు సాగించిన పోరాటంలో ఓటుహక్కు ఉద్యమం ఒకటి. నాటి పాలనలో అంతర్భాగమైన స్థానిక సంస్థలకు 1907లో నిర్వహించిన ఎన్నికల్లో భారతీయులకు ఓటు హక్కు కల్పించాలని ఉద్యమం సాగించారు.

1909లోనే భారతీయులకు ఓటు హక్కు

కదిరి అర్బన, ఏప్రిల్‌ 29: దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటీ్‌షవారిపై భారతీయులు సాగించిన పోరాటంలో ఓటుహక్కు ఉద్యమం ఒకటి. నాటి పాలనలో అంతర్భాగమైన స్థానిక సంస్థలకు 1907లో నిర్వహించిన ఎన్నికల్లో భారతీయులకు ఓటు హక్కు కల్పించాలని ఉద్యమం సాగించారు. దీంతో బ్రిటీష్‌ ప్రభుత్వం రాయల్‌ కమిషన ఏర్పాటు చేసింది. దాని సిఫార్సుల ఫలితంగా 1909లో జరిగిన కౌన్సిల్‌ ఎన్నికల్లో కౌన్సిల్‌ చట్టం ప్రకారం కొద్దిమంది భారతీయులకు ఓటు హక్కు కల్పించారు. అప్పటినుంచి కొనసాగిన ఉద్యమాలతో 1935లో ఓటు హక్కును విస్తృతం చేస్తూ భారతీయుల ఓటు హక్కు శాతాన్ని 10.6శాతానికి పెంచారు. అనంతరం జరిగిన రాజ్యాంగపరిషత ఎన్నికల నాటికి 28.5 శాతం ప్రజలకు ఓటు హక్కు వచ్చింది. 1947లో దేశానికి స్వాతంత్య్రం లభించాక ప్రజాస్వామ్య విధానానికి కట్టుబడి భారత రాజ్యాంగం 326 అధికారణ ప్రకారం 21సంవత్సరాలు నిండిన భారతీయ పౌరులకు ఓటు హక్కు అమలు చేశారు. 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ ప్రభుత్వం ఓటు హక్కు వయోపరిమితిని 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించింది.

Updated Date - Apr 29 , 2024 | 11:56 PM