Share News

AP Politics: ‘బ్రహ్మారెడ్డిని ఊర్లోకి తెచ్చేంత మగాడివారా?!’

ABN , Publish Date - Apr 13 , 2024 | 07:40 AM

‘బ్రహ్మారెడ్డిని(Brahma Reddy) ఊర్లోకి తెచ్చేంత మగాడివారా? వైసీపీకి(YCP) వ్యతిరేకంగా ప్రచారం చేసి బతికి బట్టకట్టాలని ఉందా? కొడకా!.. టీడీపీకి ప్రచారం చేస్తే అదే నీకు చివరిరోజు అవుతుంది’ అని దుర్భాషలాడుతూ టీడీపీ ముస్లిం మైనార్టీ నేతపై వలంటీర్లు, వైసీపీ రౌడీ మూకలు కర్రలు, రాడ్లతో విచక్షణా రహితంగా దాడిచేశారు. ఈ సంఘటన పల్నాడు(Palnadu) జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల(Rentachintala) మండలం తుమృకోటలో..

AP Politics: ‘బ్రహ్మారెడ్డిని ఊర్లోకి తెచ్చేంత మగాడివారా?!’
YSRCP

  • టీడీపీ ముస్లిం మైనార్టీ నేతపై వలంటీర్లు, వైసీపీ నేతల దాడి

  • రెంటచింతలలో బరితెగించిన వైసీపీ కోటరీ

రెంటచింతల, ఏప్రిల్‌ 13: ‘బ్రహ్మారెడ్డిని(Brahma Reddy) ఊర్లోకి తెచ్చేంత మగాడివారా? వైసీపీకి(YCP) వ్యతిరేకంగా ప్రచారం చేసి బతికి బట్టకట్టాలని ఉందా? కొడకా!.. టీడీపీకి ప్రచారం చేస్తే అదే నీకు చివరిరోజు అవుతుంది’ అని దుర్భాషలాడుతూ టీడీపీ ముస్లిం మైనార్టీ నేతపై వలంటీర్లు, వైసీపీ రౌడీ మూకలు కర్రలు, రాడ్లతో విచక్షణా రహితంగా దాడిచేశారు. ఈ సంఘటన పల్నాడు(Palnadu) జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల(Rentachintala) మండలం తుమృకోటలో శుక్రవారం రాత్రి జరిగింది. తుమృకోటకు చెందిన టీడీపీ నేత పఠాన్‌ జలీల్‌ ఖాన్‌పై వైసీపీకి చెందిన పలువురు నేతలు అకారణంగా దాడి చేసి గాయపరిచారు. కూటమి అభ్యర్థి బ్రహ్మారెడ్డి ఈనెల 10న తుమృకోటలో ఇఫ్తార్‌ విందుకు హాజరయ్యారు. గ్రామంలో ముస్లిం మైనార్టీ నేతలను కూడగట్టడంలో జలీల్‌ఖాన్‌ కీలకపాత్ర పోషించారు. మహిళల హారతులు, బాణ సంచా నడుమ బ్రహ్మారెడ్డిని ఊరేగిస్తూ ఘన స్వాగతం పలికారు. దీంతో జలీల్‌ఖాన్‌పై కక్ష పెంచుకున్న వైసీపీ వర్గీయులు మూడు రోజులుగా కాపు కాస్తున్నారు.


ఈ క్రమంలో శుక్రవారం సాయం త్రం మసీదు సెంటర్లో ఒంటరిగా కనిపించిన జలీల్‌ఖాన్‌పై వైసీపీకి చెందిన షేక్‌ రషీద్‌, షేక్‌ గోరెపూడి కుతుబుద్దీన్‌తోపాటు.. వలంటీర్లు షేక్‌ గోరెపూడి హుస్సేన్‌బాషా, షేక్‌ గోరెపూడి మెహబూబ్‌ సుభానీ రాడ్లతో విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచారు. అచేతన స్థితిలో ఉన్న జలీల్‌ఖాన్‌ రెండు చేతులెత్తి దండం పెట్టి బతిమలాడినా వినలేదు. ఈ దాడిలో జలీల్‌ఖాన్‌ తలకు తీవ్ర గాయమై రక్తస్రావమైంది. జలీల్‌ఖాన్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లేందుకు యత్నించిన ఎస్‌కే చాంద్‌వలీ అనే వ్యక్తిపై కూడా రాడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అనంతరం స్థానికులంతా కలిసి క్షతగాత్రులిదరినీ ప్రత్యేక వాహనంలో మాచర్ల పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.


ఈసీ స్పందించాలి..

కాగా, రెంటచింతలలో ఇలాంటి ఘటనలు సర్వసాధారణమైపోయాయి. మంచికల్లులో ఈ నెల 10వ తేదీన ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణ దేవరాయలుకు చెందిన ప్రచార వాహనాన్ని ధ్వంసం చేయడం, ప్రచారరథం రెంటచింతలలో తిరగడానికి వీల్లేదని హుకుం జారీ చేయడం తెలిసిందే! మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయోనని ప్రజల్లో ఆందోళన నెలకొంది. మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నేతలపై దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. దీనికి అడ్డుకట్ట వేయకపోతే ప్రశాంత ఎన్నికలకు నియోజకవర్గ ఓటర్లు దూరమవుతారని, దీనిపై ఎన్నికల కమిషన్‌ స్పందించాలని కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 13 , 2024 | 07:48 AM