Share News

KS Jawahar:తోట త్రిమూర్తులను వైసీపీ నుంచి వెంటనే బహిష్కరించాలి

ABN , Publish Date - Apr 16 , 2024 | 05:37 PM

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన దళిత యువకుల శిరోముండనం కేసుకు సంబంధించి ఎట్టకేలకు తీర్పు విడుదలైంది. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ, మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తుల (Thota Trimurthulu) కు విశాఖపట్నం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఈ కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి 18 నెలల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఈ విషయంపై మాజీ మంత్రి కే ఎస్. జవహర్ (KS Jawahar) కీలక వ్యాఖ్యలు చేశారు.

KS Jawahar:తోట త్రిమూర్తులను వైసీపీ నుంచి వెంటనే బహిష్కరించాలి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన దళిత యువకుల శిరోముండనం కేసుకు సంబంధించి ఎట్టకేలకు తీర్పు విడుదలైంది. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ, మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తుల (Thota Trimurthulu) కు విశాఖపట్నం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఈ కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి 18 నెలల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఈ విషయంపై మాజీ మంత్రి కే ఎస్. జవహర్ (KS Jawahar) కీలక వ్యాఖ్యలు చేశారు. 1996లో నేరం చేసిన తోట త్రిమూర్తులకు నేడు శిక్ష పడిందని చెప్పారు.


AP Election 2024: ఆ వీడియోలు ఎలా బయటకు వచ్చాయి.. నట్టికుమార్ కీలక వ్యాఖ్యలు

న్యాయం జరగడంలో ఆలస్యమవ్వొచ్చేమో గానీ న్యాయం మాత్రం గెలుస్తుందన్నారు. తోట త్రిమూర్తులను సీఎం జగన్ (CM Jagan) బహిష్కరించకపోతే దళితుల అణచివేతకు లైసెన్స్ ఇచ్చినట్లేనని అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి, రాజ్యాంగ రచనలు, అంబేద్కర్ ఆలోచనలతో నేడు దళితులకు న్యాయం జరిగిందని తెలిపారు. తోట త్రిమూర్తులుకు 18 నెలల జైలు శిక్ష పడటం హర్షణీయమన్నారు. న్యాయమే గెలుస్తుందనడానికి ఈ తీర్పే నిదర్శనమని చెప్పారు. 1996లో ఐదుగురు దళితులను శిరోముండనం చేసి త్రిమూర్తులు అవమానించారని మండిపడ్డారు.


AP Highcourt: చంద్రబాబుపై నమోదైన కేసుల్లో దిగొచ్చిన ఏపీ సర్కార్

జగన్‌కు రాజ్యాంగం పట్ల నమ్మకం లేదని, అంబేద్కర్ ఆలోచనపట్ల అవగాహన లేదని చెప్పారు. జగన్‌కు దళితులపై కక్ష ఉందని.. ఆయన దళితుల మేనమామ కాదు కంస మామ అని ఆరోపించారు. తుర్కిలో, నెల్లూరులో లిడ్ క్యాప్, లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఇండ్ల స్థలాలు అన్యాక్రాంతం చేసిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.

తోట త్రిమూర్తుల అభ్యర్థిత్వాన్ని ఎన్నికల కమిషన్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దళితులపై దాడులు చేయించడానికే తోట త్రిమూర్తులను అక్కడ నుంచి పోటీ చేయించారన్నారు. దళితుల అనేక సంక్షేమ పథకాలను జగన్ రద్దు చేశారని ధ్వజమెత్తారు. దళితులపై చిత్తశుద్ధి ఉంటే వారిపై దాడులు చేసినవారిని శిక్షించాలని జవహర్ కోరారు.


ఇవి కూడా చదవండి

CM Jagan: అందుకే జగన్‌పై రాయి విసిరా.. పోలీసు విచారణలో యువకుడు షాకింగ్ విషయాలు

YSRCP: 28 ఏళ్ల నిరీక్షణ.. శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 16 , 2024 | 05:40 PM