Share News

ChandraBabu: పవన్‌తో జగన్ సంసారం చేయగలడా?

ABN , Publish Date - Apr 20 , 2024 | 08:27 PM

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నీతి, నిజాయితీగా రాజకీయాలు చేస్తారని.. అటువంటి వ్యక్తిపై వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్ విమర్శలు చేయడం బాధకరమని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటే నీకేంటంటూ సీఎం వైయస్ జగన్‌ను చంద్రబాబు ప్రశ్నించారు. జగన్‌కు ఏ మాత్రం సిగ్గున్నా పవన్ కల్యాణ్‌తో సంసారం చేయగలడా? అని సూటిగా నిలదీశారు.

ChandraBabu: పవన్‌తో జగన్ సంసారం చేయగలడా?
Chandrababu

తిరుపతి, సత్యవేడు ఏప్రిల్20: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నీతి, నిజాయితీగా రాజకీయాలు చేస్తారని.. అటువంటి వ్యక్తిపై వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్ విమర్శలు చేయడం బాధకరమని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు.

పవన్ కల్యాణ్ ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటే నీకేంటంటూ సీఎం వైయస్ జగన్‌ను చంద్రబాబు ప్రశ్నించారు. జగన్‌కు ఏ మాత్రం సిగ్గున్నా పవన్ కల్యాణ్‌తో సంసారం చేయగలడా? అని సూటిగా నిలదీశారు. శనివారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సత్యవేడులో ప్రజాగళం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.

చెల్లెళ్లు షర్మిళ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా అంటూ సీఎం జగన్‌ను నిలదీశారు. జగన్‌పై రాయి దాడితో మాకేంటి సంబంధమన్నారు. సిఎంపై రాయి దాడి జరిగితే పోలీసులు హత్యాయత్నం కేసు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. నాపై ఎన్నో సార్లు దాడి జరిగినా పోలీసులు పట్టించుకోలేదని గుర్తు చేశారు. విద్యుత్ ఛార్జీలను అమాంతం పెంచి సామాన్యుల నడ్డి విరిచారని విమర్శించారు.


నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలను సైతం తీసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపిలో ఉన్న మద్యం బ్రాండ్‌లు పక్కనున్న తమిళనాడులో కూడా లేవన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతంగా పెరిగిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానంటాయని ఆందోళన వ్యక్తం చేశారు.

పథకాల పేరుతో 10 రూపాయలిచ్చి..100 రూపాయలు దోచుకున్నారంటూ జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. చెత్త మీద కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అభివర్ణించారు. ఏపీ కేబినెట్‌లో బూతుల మంత్రులు వున్నారని.. వాళ్లు నన్ను తిట్టడంతోపాటు నాపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందన్నారు.

సమరానికి సై అంటూ సత్యవేడు తొడకొడుతోందని చెప్పారు. ప్రత్యేకంగా దళితుల్లో తిరుగుబాటు అధికంగా కనిపిస్తోందన్నారు. సత్యవేడులోని ఇసుక, గ్రావెల్‌ను పక్క రాష్ట్రం తమిళనాడుకు అమ్మేసిన ఘనుడు మంత్రి పెద్దిరెడ్డి అని అన్నారు. దళితులను ఊచకోత కోసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని అభివర్ణించారు. ఏపీలో త్వరలో జరిగే ఎన్నికల్లో 29 రిజర్వ్ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులే గెలువనున్నారు.


నీతి, నిజాయితీగా రాజకీయాలు చేసిన వ్యక్తిని నేనని.. అలాంటి నాపై ఈ జగన్మోహన్ రెడ్డి 22 అక్రమ కేసులు పెట్టాడని గుర్తు చేశారు. నా పైనే కాదు టిడిపి నాయకులు, కార్యకర్తలపై కూడా తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. వైసిపి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు. టిడిపి హయాంలో ప్రవేశపెట్టిన 29 పథకాలను కక్షపూరితంగా రద్దు చేశారని విమర్శించారు. దళితుల కోసం ఎన్నో పథకాలను తీసుకొస్తే..ఆ పథకాలను సైతం ఎత్తేశారన్నారు.

సామాజిక న్యాయం అనే మాట మాట్లాడే అర్హత ఈ జగన్‌కు లేదన్నారు. ఉచిత విద్యుత్‌ను టిడిపి హయాంలో ఇచ్చామని చెప్పారు. దళిత పారిశ్రామికవేత్తలకు రాయితీలను ఇస్తే.. వాటిని రద్దు చేశారని చెప్పారు. విదేశీ విద్య కోసం టిడిపి హయాంలో బడ్జెట్ ను కేటాయిస్తే..ఆ పథకం పేరు మార్చి నిధులు కేటాయించ లేదన్నారు. వైసిపి హయాంలో పెత్తందారి వ్యవస్థ కనిపించిందని పేర్కొన్నారు.

200కిపైగా టిప్పర్లు, ట్రాక్టర్లతో ప్రతిరోజు ఇసుకను దోచేసిన వ్యక్తి పెద్దిరెడ్డి అని అన్నారు. ఎర్రచందనం స్మగ్లర్‌ను చిత్తూరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టడం దారుణమని వ్యాఖ్యానించారు. దళితులను వైసిపి నేతలు హేళనగా చూశారన్నారు. వారిని అవమానించి, హత్య చేయించారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ వార్తలు కోసం..

Updated Date - Apr 20 , 2024 | 08:27 PM