Share News

AP News: ఈ కేసుపై హైకోర్టులో అప్పిల్ వేస్తా.. తోట త్రిమూర్తులు కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Apr 16 , 2024 | 06:14 PM

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన దళిత యువకుల శిరోముండనం కేసుకు సంబంధించి ఎట్టకేలకు తీర్పు విడుదలైంది. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ, మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తుల (Thota Trimurthulu) కు విశాఖపట్నం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.

AP News: ఈ కేసుపై హైకోర్టులో అప్పిల్ వేస్తా.. తోట త్రిమూర్తులు కీలక వ్యాఖ్యలు

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన దళిత యువకుల శిరోముండనం కేసుకు సంబంధించి ఎట్టకేలకు తీర్పు విడుదలైంది. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ, మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తుల (Thota Trimurthulu) కు విశాఖపట్నం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి 18 నెలల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. అయితే శిరోముండనం కేసులో సస్పెన్షన్ ఆఫ్ జడ్జిమెంట్ కోసం కోర్టులో తోట త్రిమూర్తులు, సహ నిందితులు ఆపిల్ చేశారు.


AP Highcourt: చంద్రబాబుపై నమోదైన కేసుల్లో దిగొచ్చిన ఏపీ సర్కార్

వీరి అభ్యర్థన మేరకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మాట్లాడుతూ... 28 సంవత్సరాలుగా ఈ కేసు నడుస్తోందని చెప్పారు. న్యాయపరంగా ఇచ్చిన తీర్పుని గౌరవిస్తున్నానని తెలిపారు. తనకు వ్యక్తిగతంగా జరిగిన అన్యాయంపై హైకోర్టులో అప్పిల్ వేస్తానని అన్నారు. ఆ కోర్టులో తప్పకుండా తనకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నానని చెప్పారు. తాను ఈ కేసులో నిర్ధోషిగా బయటకు వస్తాననే నమ్మకం తనకుందన్నారు. రాజకీయంగా కొంతమంది ఈ కేసును ఆసరాగా తీసుకొని తనపై విమర్శలు చేశారని మండిపడ్డారు.


CM Jagan: అందుకే జగన్‌పై రాయి విసిరా.. పోలీసు విచారణలో యువకుడు షాకింగ్ విషయాలు

ఈ కేసు పెట్టిన తర్వాత కూడా తాను మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యానంటే ప్రజల మద్దతు తనకుందని అర్థం చేసుకోవాలని చెప్పారు. మండపేట ఎన్నికల్లో కూడా దళిత సోదరులు తన వెంట ఉండి గెలిపిస్తారనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజకీయాలకు, ఈ కేసుకు సంబంధం లేదని తోట త్రిమూర్తులు తేల్చిచెప్పారు.


YSRCP: 28 ఏళ్ల నిరీక్షణ.. శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

మరిన్ని ఏపీ వార్తల కోసం..

Updated Date - Apr 16 , 2024 | 07:29 PM