Share News

tdp:మరిన్ని పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తాం : బీకే

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:40 AM

ధర్మవరం, ఏప్రిల్‌ 28: ప ట్టణంలోని సీఎనబీ ఫంక్షన హాల్లో ఆదివారం బెంగళూర్‌కు చెందిన తెలుగు ప్రొఫెషనవింగ్‌ సభ్యులు హిందూపురం పార్లమెంట్‌ టీడీపీ కూటమి ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారధితో ముఖాముఖి నిర్వహించారు. ఇందులో బీకే పార్థసారధి మాట్లాడుతూ...

 tdp:మరిన్ని పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తాం : బీకే
ముఖాముఖిలో మాట్లాడుతున్న బీకే పార్థసారధి

ధర్మవరం, ఏప్రిల్‌ 28: ప ట్టణంలోని సీఎనబీ ఫంక్షన హాల్లో ఆదివారం బెంగళూర్‌కు చెందిన తెలుగు ప్రొఫెషనవింగ్‌ సభ్యులు హిందూపురం పార్లమెంట్‌ టీడీపీ కూటమి ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారధితో ముఖాముఖి నిర్వహించారు. ఇందులో బీకే పార్థసారధి మాట్లాడుతూ... కరువుకు నిలయమైన ఉమ్మడి అనంత జిల్లాకు మరిన్ని పరిశ్రమలు తీసుకురావడంతో పాటు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక పట్టుపట్టి జిల్లాకు కియ కార్ల పరిశ్రమను తీసుకొచ్చారన్నారు. వీటి వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 50వేల మంది దాకా ఉపాది పొందుతున్నట్లు చెప్పారు. వైఎస్‌ జగన సీఎం అయ్యాక పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ దోపిడీ, బెదిరింపుల వల్ల కొన్ని అనుబంధ సంస్థలు వెళ్లిపోయాయన్నారు. అంతేకాకుండా రావాల్సిన కొన్ని సంస్థలు కూడా వెనక్కి వెళ్లిపోయాయని చెప్పారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశరెడ్డి వల్ల వచ్చిన జాకీ పరిశ్రమ పోయిందన్నారు. దీని వల్ల దాదాపు 6వేల మందికి ఉపాధి దూరమైందన్నారు.


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ యువతకు ఉపాధి అవకాశాలపై అత్యంత శ్రద్ధను కనబరుస్తున్నారని, కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి రాగానే సత్యకుమార్‌తో కలిసి లోకేశ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి మరిన్ని పరిశ్రమలు తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పారు. చిక్‌బళ్లాపూర్‌ నుంచి గోరంట్ల మీదుగా పుట్టపర్తికి రైల్వే లేన ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఇక సత్యసాయిజిల్లా వ్యాప్తంగా తాగునీటి ఎద్దడి ఎక్కడ ఉందో గుర్తించి పరిష్కరిస్తామన్నారు. పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమలకు కావాల్సినంత భూములు సత్యసాయి జిల్లాలో ఉన్నాయన్నారు. వాటిల్లో పరిశ్రమలు ఏర్పాటుచేస్తే అందరికీ ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు. వ్యవసాయరంగంలో వినూత్న మార్పులు తీసుకురావడంతో పాటు ప్రతి రైతుకు ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని బీకే తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....


Updated Date - Apr 29 , 2024 | 12:40 AM