Share News

tdp: చంద్రబాబుతోనే ప్రజాసంక్షేమం: కందికుంట

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:37 AM

తనకల్లు, ఏప్రిల్‌ 28: చంద్రబాబుతోనే ప్రజా సంక్షేమం సాధ్యమని, ఆయన సీఎం అయితే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్‌ పేర్కొన్నారు.మండలంలోని కోర్తికోట పంచాయతీలో గల గ్రామాల్లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. తొలుత తిరు మయ్యగారిపల్లిలో ప్రచారం నిర్వహించారు.

 tdp: చంద్రబాబుతోనే ప్రజాసంక్షేమం: కందికుంట
కోర్తికోటలో కందికుంటకు గజమాలతో స్వాగతం పలుకుతున్న గ్రామస్థులు

తనకల్లు, ఏప్రిల్‌ 28: చంద్రబాబుతోనే ప్రజా సంక్షేమం సాధ్యమని, ఆయన సీఎం అయితే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్‌ పేర్కొన్నారు.మండలంలోని కోర్తికోట పంచాయతీలో గల గ్రామాల్లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. తొలుత తిరు మయ్యగారిపల్లిలో ప్రచారం నిర్వహించారు. అక్కడ గ్రామ స్థులు పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. మ హిళలు హారతులు పట్టారు. తర్వాత ఆయన ఇంటింటా తిరిగి సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా బీకే పార్థసారధిని గెలిపించాలి ప్రజల్ని కోరారు. చంద్రబాబు సీఎం అయిన వెంటనే సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలు చేస్తారన్నారు. ఆ పథకాల వల్ల కుటుంబంలోని అందరికీ లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి కావాలంటే చంద్రబాబు సీఎం కావాలని చెప్పారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని, మళ్లీ రాష్ట్రం గాడిన పడాలంటే చంద్రబాబు రావాలని పేర్కొన్నారు. తాను గెలిస్తే నియోజవర్గంలోని అన్ని సమస్యల్ని పరిష్కరిస్తానన్నారు.


తర్వాత కొండవెనుకపల్లి, మించలవారికోట, తుమ్మలవాండ్లపల్లి, తోడేళ్లగడ్డపల్లి, మంగదిన్నె పల్లి, కొర్తికోట, గ్రామాల్లో ప్రచారం చేపట్టారు. అదేవిధంగా కొక్కంటి, డి. చెక్కవారిపల్లి గ్రామాల్లోనూ కందికుంట ప్రచారం కొనసాగించారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు ఎస్‌కే. మస్తావలి, రెడ్డిశేఖర్‌రెడ్డి, హనుమంతరెడ్డి, మంజు నాథ్‌, వైవీ దినకర్‌ ప్రసాద్‌నాయుడు, ఈశ్వర్‌రెడ్డి, రాజారెడ్డి, శంకర్‌ నాయుడు, బాగేపల్లి చలపతి, బీసీ నాగభూషణం, తోటసరోజమ్మ, చిన్నప్ప, మహబూబ్‌బాషా, దస్తగిరి, ఉత్తన్ననాయక్‌, మాజీ సర్పంచలు ఈశ్వర్‌రెడ్డి, నాగమల్లు, జనసేన నాయకులు కుమార్‌, రమణ, సత్యవతి, బీజేపీ నాయకులు బాలాజీ తదితరులు పాల్గొన్నారు


మరిన్ని అనంతపురం వార్తల కోసం....


Updated Date - Apr 29 , 2024 | 12:37 AM