Share News

సెట్‌- 2024 నోటిఫికేషన్‌ విడుదల

ABN , Publish Date - May 05 , 2024 | 05:20 AM

అసెస్టెంట్‌ ప్రొఫెసర్‌, లెక్చరర్ల అర్హత పరీక్ష అయిన తెలంగాణ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ -2024 నోటిఫికేషన్‌ శనివారం విడుదలైంది. ఉస్మానియా వర్సిటీ

సెట్‌- 2024 నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌ సిటీ, మే 4 (ఆంధ్రజ్యోతి): అసెస్టెంట్‌ ప్రొఫెసర్‌, లెక్చరర్ల అర్హత పరీక్ష అయిన తెలంగాణ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ -2024 నోటిఫికేషన్‌ శనివారం విడుదలైంది. ఉస్మానియా వర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించే సెట్‌ నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ లింబాద్రి విడుదలచేశారు. ఈ నెల 14వ తేదీ నుంచి జూలై 2లోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నట్లు సభ్య కార్యదర్శి నరేశ్‌రెడ్డి వెల్లడించారు. ఆగస్టు 28, 29, 30, 31వ తేదీల్లో సెట్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Updated Date - May 05 , 2024 | 08:19 AM