Share News

బీజేపీ ఏమిచ్చింది.. గాడిద గుడ్డు

ABN , Publish Date - May 02 , 2024 | 11:47 PM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం సిద్దిపేటలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌కు జనం భారీగా తరలివచ్చారు. మీటింగ్‌లో ఆయన ఇటు బీఆర్‌ఎస్‌, అటు బీజేపీపై విమర్శల బాణం ఎక్కుపెట్టారు. పదేళ్లలో బీజేపీ తెలంగాణకు ఏమిచ్చింది గాడిదగుడ్డు.. మోదీ ఏమిచ్చారు గాడిద గుడ్డు.. రఘునందన్‌ ఏమిచ్చాడు గాడిద గుడ్డు... అంటూ కార్యకర్తల్లో జోష్‌ నింపారు.

బీజేపీ ఏమిచ్చింది.. గాడిద గుడ్డు
మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి

బీఆర్‌ఎస్‌లో పోటీ చేసేందుకు ఒక్కరూ లేరా?

కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం

సిద్దిపేట కార్నర్‌ మీటింగ్‌లో రేవంత్‌రెడ్డి

కార్యకర్తలో జోష్‌ నింపిన సీఎం

సిద్దిపేట టౌన్‌, మే 2 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం సిద్దిపేటలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌కు జనం భారీగా తరలివచ్చారు. మీటింగ్‌లో ఆయన ఇటు బీఆర్‌ఎస్‌, అటు బీజేపీపై విమర్శల బాణం ఎక్కుపెట్టారు. పదేళ్లలో బీజేపీ తెలంగాణకు ఏమిచ్చింది గాడిదగుడ్డు.. మోదీ ఏమిచ్చారు గాడిద గుడ్డు.. రఘునందన్‌ ఏమిచ్చాడు గాడిద గుడ్డు... అంటూ కార్యకర్తల్లో జోష్‌ నింపారు. ఇక మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఒక్కరు కూడా లేరని, ఇతర ప్రాంతానికి నుంచి వెంకట్రామారెడ్డిని తీసుకువచ్చి పార్టీ అభ్యర్థిగా నిలబెట్టారని ఎద్దేవా చేశారు. నియోజకవర్గ ఇన్‌చార్జి పుజాల హరికృష్ణ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద నిర్వహించిన కార్యక్రమానికి జనం భారీగా తరలివచ్చారు. ముందుగా కలెక్టరేట్‌ వద్ద హెలిప్యాడ్‌ దిగిన సీఎం రేవంత్‌రెడ్డికి సిద్దిపేట కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. స్థానిక కొత్త బస్టాండ్‌ నుంచి పాత బస్టాండ్‌ వరకు సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన రోడ్‌ షోలో ప్రజలు జననీరాజనం పలికారు. కార్నర్‌ మీటింగ్‌కు చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి మంత్రులుగా, వివిధ కార్పొరేషన్‌ చైర్మన్లుగా అవకాశమిచ్చామని, కాంగ్రె్‌సతోనే అన్నివర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. బీజేపీ, బీఆర్‌ఎ్‌స రెండు ఒక్కటేనని, రాత్రి కాగానే వారిదంతా ఒకటే మందు పార్టీ అని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దుబ్బాకకు రఘునందన్‌రావు ఏం చేశాడని, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ అమలు చేస్తామని, హరీశ్‌రావు రాజీనామా చేసిన తర్వాత సిద్దిపేటకు కొత్త ఎమ్మెల్యేగా పూజల హరికృష్ణను గెలిపించుకుంటామని తెలిపారు. అనంతరం ఉమ్మడి మెదక్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో బీసీలంతా ఐక్యంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సిద్దిపేట మీటింగ్‌కు వచ్చిన మిమ్మల్ని చూస్తుంటే మెదక్‌ పార్లమెంట్‌ అభ్యర్థి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మెదక్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో మాజీ సీఎం కేసీఆర్‌, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుపై మీరు పగ తీర్చుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని సూచించారు. ప్రొఫెసర్‌ కోదండరాం మాట్లాడుతూ సిద్దిపేటలో కార్నర్‌ మీటింగ్‌తో జనం ఉత్సాహం, ఆనందాన్ని నేనెప్పుడూ చూడలేదని చెప్పారు. కేంద్రం గ్యాస్‌ ధర పెంచితే, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్‌రెడ్డి సగానికి సగం తగ్గించారని తెలిపారు. దేశంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు మీరంతా పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను దీవించాలన్నారు. కార్యక్రమంలో మెదక్‌ ఎమ్మెల్యే రోహిత్‌, నాయకులు నిర్మలాజగ్గారెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, ఎలక్షన్‌రెడ్డి, చెరుకు శ్రీనివా్‌సరెడ్డి, అద్దంకి దయాకర్‌, సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్‌, నాయిని నరసింహారెడ్డి, రియాజుద్దీన్‌, బుచ్చిరెడ్డి, సాకి బాల్‌లక్ష్మిఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్సీ

బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ, టీఎఎ్‌సపీఎస్సీ మాజీ సభ్యుడు, సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన ఆర్‌.సత్యనారాయణను గురువారం సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సిద్దిపేటలోని హెలిప్యాడ్‌ వద్ద పలువురు నేతలతో ఆయన రేవంత్‌ను కలిశారు. సత్యనారాయణ వెంట బీఆర్‌ఎస్‌ నేతలు నర్సింహారెడ్డి, జిట్టె రవి, అమీనొద్దీన్‌, పండరి, అనంతసాగర్‌, ప్రభాకర్‌, లక్ష్మణ్‌ తదితరులు ఉన్నారు. అయితే బీఆర్‌ఎ్‌సలో ఆరేళ్ల ఎమ్మెల్సీ పదవిని రెండేళ్లలోపే వదులుకున్నప్పటికీ తనకు సరైన అవకాశాలు దక్కలేదనే అసంతృప్తితో సత్యనారాయణ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారినట్లు తెలుస్తుంది.

Updated Date - May 02 , 2024 | 11:47 PM